SVP first look: Mahesh Babu ఫ్యాన్స్‌కి తప్పని డిజ్పపాయిట్‌మెంట్

Sarkaru Vaari Paata movie first look poster updates: మహేష్ బాబు ఫ్యాన్స్‌కి సర్కారు వారి పాట మూవీ ఫస్ట్ లుక్ విషయంలో డిజప్పాయింట్‌మెంట్ తప్పడం లేదు. ప్రతీ ఏడాది మే 31న సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రి, అలనాటి సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సెలబ్రేషన్స్ (Krishna birthday celebrations) సందర్భంగా ఆ ఏడాది మహేష్ బాబు చేస్తున్న సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ లాంటి అప్‌డేట్స్ ఏవైనా రిలీజ్ అవడం అనేది ఆనవాయితీగా వస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 28, 2021, 04:10 PM IST
SVP first look: Mahesh Babu ఫ్యాన్స్‌కి తప్పని డిజ్పపాయిట్‌మెంట్

Sarkaru Vaari Paata movie first look poster updates: మహేష్ బాబు ఫ్యాన్స్‌కి సర్కారు వారి పాట మూవీ ఫస్ట్ లుక్ విషయంలో డిజప్పాయింట్‌మెంట్ తప్పడం లేదు. ప్రతీ ఏడాది మే 31న సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రి, అలనాటి సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సెలబ్రేషన్స్ (Krishna birthday celebrations) సందర్భంగా ఆ ఏడాది మహేష్ బాబు చేస్తున్న సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ లాంటి అప్‌డేట్స్ ఏవైనా రిలీజ్ అవడం అనేది ఆనవాయితీగా వస్తోంది. అలాగే ఈసారి మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న సర్కారు వారి పాట మూవీ నుంచి ఫస్ట్ లుక్ (SVP first look) వస్తుందని మహేష్ బాబు అభిమానులు ఆశించారు. కానీ ఈసారి ఎలాంటి అప్‌డేట్స్ రిలీజ్ చేయడం లేదని మహేష్ బాబు పీఆర్ టీమ్ నుంచి క్లారిటీ వచ్చేసింది.

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రస్తుత తరుణంలో తమ సినిమాను ప్రమోట్ చేసుకుంటూ సంబరాలు జరుపుకోవడం సరైంది కాదు అనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మహేష్ బాబు టీమ్ స్పష్టంచేసింది. అంతేకాకుండా సర్కారు వారి పాట ఫస్ట్‌లుక్‌పై ఎలాంటి ఫాల్స్ న్యూస్ వైరల్ చేయొద్దని మహేష్ బాబు టీమ్ కోరింది. 

Also read : Tuck Jagadish Movie: నేచురల్ స్టార్ నాని టక్ జగదీష్ విడుదలపై క్లారిటీ వచ్చేసింది, ఆ వదంతులు నమ్మవద్దు

బ్యాంకుల కుంభకోణాలు (Bank scams and frauds) నేపథ్యంతో గీత గోవిందం ఫేమ్ పరశురామ్ డైరెక్ట్ చేస్తోన్న సర్కారు వారి పాట మూవీలో మహేష్ బాబు (Mahesh Babu) సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తోంది. మహేష్ బాబు సొంత ప్రొడక్షన్ హౌజ్ జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌తో కలిసి మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ బ్యానర్ సంయుక్తంగా సర్కార్ వారి పాట సినిమాను నిర్మిస్తున్నాయి.

Also read : RRR Movie: ఆర్ఆర్ఆర్ మూవీ డిజిటల్, శాటిలైట్ రైట్స్ కోసం పోటీపడ్డ ప్రముఖ సంస్థలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News