Shahid Kapoor: బాలీవుడ్ హీరో తో మహేష్ బాబు డైరెక్టర్.. మళ్ళీ రీమేక్ సినిమానేనా..
Shahid Kapoor with Telugu Director: తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన చాలామంది హీరో హీరోయిన్లు హిందీలో కూడా తమ సత్తా చాటుతున్నారు. తాజాగా ఈ మధ్యకాలంలో తెలుగు డైరెక్టర్లు కూడా బాలీవుడ్ లో సినిమాలు చేసేందుకు ఎగబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక తెలుగు స్టార్ డైరెక్టర్ ఇప్పుడు బాలీవుడ్ లో అడుగులు వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Vamsi Paidipally : ఈమధ్య హీరో హీరోయిన్లు మాత్రమే కాక టాలీవుడ్ డైరెక్టర్లు కూడా బాలీవుడ్ లో తమ సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా తెలుగులో హిట్ అయిన అర్జున్ రెడ్డి సినిమాని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి హిట్ అందుకున్నారు. వెంటనే రన్బీర్ కపూర్ వంటి స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం కొట్టేసి యానిమల్ తో మరొక సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు.
ఈ నేపథ్యంలో సందీప్ వంగా ఇప్పుడు మిగతా తెలుగు డైరెక్టర్లకి ఇన్స్పిరేషన్ గా మారిపోయారు. మరోవైపు హిట్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శైలేష్ కొలను అదే సినిమాని హిందీలో రీమేక్ చేశారు కానీ ఆ సినిమా అనుకున్న స్థాయిలో హిట్ అవలేదు. బేబీ సినిమాతో డైరెక్టర్ గా తన సత్తా చాటిన సాయి రాజేష్ కూడా ఇప్పుడు అదే సినిమాని హిందీలో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. కానీ ఇప్పట్లో ఈ సినిమా పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
తాజాగా ఇప్పుడు మరొక ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ బాలీవుడ్ లో అడుగులు వేసి ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అతను ఎవరో కాదు వంశీ పైడిపల్లి. ప్రభాస్ మున్నా సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన వంశీ పైడిపల్లి మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు.
వారసుడు సినిమాతో అంతంత మాత్రం గానే అనిపించిన వంశీ పైడిపల్లి ఇప్పుడు బాలీవుడ్ లో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా కోసం బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ని లైన్ లోకి దింపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే షాహిద్ కపూర్ కి కథ చెప్పి వంశీ పైడిపల్లి ఒప్పించేసినట్లు సమాచారం. బాలీవుడ్ కి షిఫ్ట్ అవ్వాలని తెలుగు డైరెక్టర్లు అనుకోవడంలో పెద్ద తప్పు ఏమీ లేకపోవచ్చు కానీ ప్రస్తుతం ప్రేక్షకులు కంటెంట్ ఉన్న సినిమాని మాత్రమే ఆదరిస్తున్నారు.
పైగా ఓటీటీల పుణ్యమా అని చాలా వరకు సినిమాలు మిగతా భాషల్లో కూడా విడుదలవుతున్నాయి. కానీ టాలీవుడ్ డైరెక్టర్లు మాత్రం తమ హిట్ సినిమాలనే హిందీలో రీమేక్ చేస్తున్నారు. ప్రేక్షకులను నిరాశపరుస్తున్నారు. మరి రీమేక్ సినిమాలు కాకుండా వంశి పైడిపల్లి అయినా ఒక మంచి కథతో ప్రేక్షకుల ముందుకి వస్తారో లేదో వేచి చూడాలి.
Also read: Pink Mooon: ఆకాశంలో అద్భుతం, తెల్లవారుజామునే పింక్ మూన్, ఎన్ని గంటలకంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook