Pink Mooon: ఆకాశంలో అద్భుతం, తెల్లవారుజామునే పింక్ మూన్, ఎన్ని గంటలకంటే

Pink Mooon: ఖగోళంలో మనకు తెలియని ఎన్నో రహస్యాలు దాగుంటాయి. ఆ రహస్యాలు ఒక్కోసారి ఒక్కోరూపంలో బయటపడుతుంటాయి. అనంత వినీలాకాశంలో అలాంటిదే మరో అద్భుతం చోటుచేసుకోనుంది. అదేంటి, ఎప్పుడు ఎలా చూడవచ్చనేది తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 23, 2024, 07:04 PM IST
Pink Mooon: ఆకాశంలో అద్భుతం, తెల్లవారుజామునే పింక్ మూన్, ఎన్ని గంటలకంటే

Pink Mooon: ఆకాశంలో ఇవాళ రాత్రి అద్భుతం జరగనుంది. అత్యంత అరుదుగా కన్పించే పింక్ మూన్ సాక్షాత్కరించనుంది. పౌర్ణమి వేళ కన్పించే పూర్ణ చంద్రుడిని పింక్ మూన్‌గా అబివర్ణిస్తారు. పింక్ మూన్‌పై ఇండియాలోనే కాదు..విదేశాల్లో కూడా చాలా నమ్మకాలు ముడిపడి ఉన్నాయి. పింక్ మూన్ దర్శన సమయం ఎప్పుడో పరిశీలిద్దాం.

ఆకాశంలో ఇవాళ అంటే ఏప్రిల్ 23 అర్ధరాత్రి పింక్ మూన్ కన్పించనుంది. ఈ పింక్ మూన్‌ను అమెరికా, కెనడా సహా తూర్పు దేశాల్లో ఇవాళ సాయంత్రం 7.49 గంటలకు చూడవచ్చు. అదే ఇండియాలో అయితే రేపు అంటే బుధవారం తెల్లవారుజామున 5.19 గంటలకు కన్పిస్తుంది. పౌర్ణమి వేళ కన్పించే పూర్ణ చంద్రుడినే పింక్ మూన్ అంటారు. ఈ సందర్భంగా చంద్రుడు అత్యంత ప్రకాశవంతంగా కన్పిస్తాడు. పింక్ మూన్ కన్పించే సమయంలో ఆకాశం నుంచి ఉల్కలు రాలడాన్ని కూడా గమనించవచ్చు. 

పింక్ మూన్‌కు సంబంధించి జ్యోతిష్యశాస్త్రంలోనూ విదేశాల్లోనూ వివిధ నమ్మకాలు ముడిపడి ఉన్నాయి. పింక్ మూన్ కన్యా రాశిలో కన్పించనుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇండియాలో హనుమంతుడి పుట్టినరోజుతో ముడిపెట్టి అత్యంత పవిత్రంగా భావిస్తారు. అదే శ్రీలంక దేస్థులు మాత్రం బక్ పోయా పండుగ జరుపుకుంటారు. వసంత కాలంలో వచ్చే తొలి పున్నమిని ఆంగ్లేయులు పింక్ మూన్ అంటారు. ఈ సమయంలో ఉత్తర అమెరికా అడవుల్లో వికసించే క్రీపింగ్ ఫ్లోక్స్ లేదా మోస్ ఫ్లోక్స్ పువ్వులు గులాబీ రంగులో ఉండటం వల్లనే పింక్ మూన్ అని పేరు పెట్టినట్టు తెలుస్తోంది. యూదులైతే పింక్ మూన్‌ను పాసోవర్ మూన్ అంటారు. అంటే ఈస్టర్‌కు ముందు వచ్చే సంపూర్ణ చంద్రుడని అర్ధం. 

Also read: Cervical Pain Tips: స్పాండిలైటిస్ సర్వైకల్ నొప్పి నరకంగా మారిందా, ఈ 3 చిట్కాలు పాటిస్తే చాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News