Mahesh Babu Flaunts his Bare body in Swimming pool: హీరో మహేష్ బాబు అందగాడు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు హీరోల్లో అత్యంత అందగాడు ఎవరు అని ప్రశ్నిస్తే అందరూ ముక్తకంఠంతో చెప్పే సమాధానం మహేష్ బాబు. అయితే ఆయన ఎంత అందంగా ఉంటారో అంతకన్నా పెద్ద సిగ్గరి కావడంతో ఆయన సినిమాలలో కూడా రొమాన్స్ సీన్లు అలాగే బాడీ ఎక్స్పోజ్ చేసే సీన్లు దాదాపు కనిపించవు. ఇక సోషల్ మీడియాలో కూడా ఆయన యాక్టివ్గా ఉంటారు కానీ చాలా రిజర్వుడ్ గా ఉంటూ ఉంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలో ఆయన ఎప్పుడూ షర్ట్ విప్పి కానీ బాడీ ఎక్స్పోజ్ చేసిన దాఖలాలు కూడా లేవు. అయితే మొట్టమొదటిసారిగా సోషల్ మీడియా వేదికగా మహేష్ షర్ట్ లేకుండా స్విమ్మింగ్ పూల్లో ఉన్న ఫోటోలను ఆయన భార్య నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. షేర్ చేయడమే కాక కొన్ని శనివారం మార్నింగ్స్ ఇలాగే ఉంటాయి అని చెబుతూ ఆమె దానికి కామెంట్ కూడా పెట్టారు. మహేష్ మొట్ట మొదటిసారిగా ఇలా బేర్ బాడీని చూపిస్తూ ఉండడంతో లేడీ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు.


మహేష్ అభిమానులు కూడా మొట్టమొదటిసారి బీస్ట్ లుక్ లో మహేష్ బాబు కనిపిస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మహేష్ బాబు చివరిగా సర్కారు వారి పాట అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఈ సినిమాలో ఆయన సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. పరశురాం దర్శకత్వం వహించిన ఈ సినిమాను మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ అలాగే మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. మహేష్ బాబు తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. హారిక హాసిని సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.


ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు బాడీ బిల్డింగ్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దానికి కారణం గతంలో రణవీర్ సింగ్, ఎన్టీఆర్ వంటి హీరోలకు బాడీ ఫిట్నెస్ ట్రైనర్ గా పనిచేసిన లాయిడ్ స్టీవెన్స్ అనే ఒక అమెరికన్ వ్యక్తి తాజాగా మహేష్ బాబుతో కలిసి దిగిన ఫోటో షేర్ చేయడం ఈ వార్తలకు కారణమైందని చెప్పవచ్చు. అయితే మహేష్ బాబు నిజంగా బాడీ బిల్డింగ్ చేస్తున్నది త్రివిక్రమ్ సినిమా కోసమేనా? లేక ఆ తర్వాత సినిమా చేయాల్సిన రాజమౌళి సినిమా కోసమా? అనే విషయం మీద మాత్రం రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయం మీద స్వయంగా మహేష్ బాబు క్లారిటీ ఇస్తే కానీ చర్చలు ఒక కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు.


Also Read: Karthikeya 2 Collections: కార్తికేయ 2 ఏడు రోజుల కలెక్షన్స్.. రివర్స్ లో షాకిస్తున్న వసూళ్లు!


Also Read: Actress Namitha blessed with twins: నమితకు కవల పిల్లలు.. ఫోటోలు చూశారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి