Actress Namitha blessed with twins: నమితకు కవల పిల్లలు.. ఫోటోలు చూశారా?

Actress Namitha blessed with twin boys: తాజాగా హీరోయిన్ నమిత కవలలకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 20, 2022, 11:29 AM IST
Actress Namitha blessed with twins: నమితకు కవల పిల్లలు.. ఫోటోలు చూశారా?

Actress Namitha blessed with twin boys: హీరోయిన్ నమిత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో అనేక సినిమాలతో ఆమె తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. నిజానికి గుజరాత్ లో పుట్టి పెరిగిన ఈ భామ ముందుగా తెలుగు సినిమాల ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది. సొంతం సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైన ఆమె జెమినీ అనే రెండో సినిమాతో సూపర్ హిట్ అందుకుంది.

తర్వాత తెలుగులో వరుస సినిమాలు చేస్తూ వెళ్లిన ఆమె కేవలం తెలుగు సినిమాలకే పరిమితం కాకుండా తమిళ, కన్నడ, మలయాళ, ఇంగ్లీష్ భాషల్లో సైతం సినిమాలు చేసింది. ఇక ఆమెకు తమిళనాడులో ఒకప్పుడు గుడి కూడా కట్టారంటే తమిళ ప్రేక్షకులకు ఏ మాత్రం దగ్గర అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో చెన్నైలోనే సెటిల్ అయిన ఈ భామ వీరేంద్ర చౌదరి అనే తెలుగు వ్యక్తిని ప్రేమించి పెళ్లాడింది. 2017లో వీరి వివాహం జరిగింది.

ఆ తర్వాత కూడా ఆమె అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూనే ఉంది. ఇక నమిత తాను గర్భవతి అనే విషయాన్ని తన 41వ పుట్టిన రోజున వెల్లడించింది. ఇక తాజాగా ఆమె కవలలకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకున్నారు. తాను ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చానని తాను, ఇద్దరు పిల్లలు ఆరోగ్యంగానే ఉన్నానని అభిమానులు ఆశీస్సులు ఈ సమయంలో తమకు కావాలని ఆమె కోరారు. కవలలను ఆమె ఎత్తుకొని భర్తతో ఉన్న వీడియోని తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇక ఈ భామ బీజేపీలో సైతం చేరింది. కానీ తమిళనాడులో బీజేపీకి అంత క్రేజ్ లేకపోవడంతో ఆమె ప్రస్తుతానికి సినిమాలు చేస్తూనే బిజీ బిజీగా గడిపే ప్రయత్నం చేస్తోంది.

Also Read: Rhea Chakraborty Hot Photos: సుశాంత్ రాజ్ పుత్ ప్రియురాలి హాట్ ట్రీట్.. అంతా కనిపించేలా!

Also Read: Dimple Hayathi Pics: నైట్ వేర్‌లో క్లివేజ్ అందాలు.. సెగలు పెట్టిస్తున్న డింపుల్ హయాతి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News