Guntur Kaaram Pre-release Event: మహేష్ `గుంటూరు కారం` ప్రీరిలీజ్ ఈవెంట్ కు వెన్యూ, డేట్ ఫిక్స్.. ఇందులో నిజమెంత?
Guntur Kaaram Update: అభిమానులకు సడన్ సర్ ప్రైజ్ లు ఇస్తున్నారు గుంటూరు కారం టీం. ఇవాళే ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. అంతేకాకుండాప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన గుడ్ న్యూస్ కూడా చెప్పారు.
Guntur Kaaram Pre-release Event Update: సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతగానో ఆశగా ఎదురుచూస్తున్న టైం రానే వచ్చింది. ఈరోజే గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. దీంతోపాటు మరో శుభవార్తను కూడా చెప్పారు. గుంటూరు కారం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వెన్యూ, డేట్ ఫిక్స్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జనవరి 06న నిర్వహించాల్సిన ప్రీ రిలీజ్ కార్యక్రమం భద్రతా కారణాల వల్ల క్యాన్సిల్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. మరి దీనిని ఎప్పుడు నిర్వహిస్తారు, అసలు ఉంటుందా లేదా.. అని ఎన్నో ప్రశ్నలు అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. గుంటూరు వేదికగా జనవరి 09న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫ్లాన్ చేస్తున్నారట మేకర్స్. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూవీ కావడంతో దీనిపై వీర లెవల్లో అంచనాలు ఉన్నాయి. ఇందులో శ్రీలీలా, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రమ్యకృష్ణ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు మేకర్స్. అంతేకాకుండా ఈసినిమాను ఓవర్సీస్లో కూడా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. యూఎస్ఏలో 5 వేలకు పైగా స్క్రీన్స్ లో ఈ మూవీని ప్రదర్శించనున్నారట. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ఆడియెన్స్ లో విపరీతమైన హైప్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.
Also Read: Jabardasth Avinash: జబర్దస్త్ కమెడియన్ ఇంట విషాదం.. బిడ్డను కోల్పోయి పుట్టెడు దు:ఖంలో అవినాష్..
Also Read: Sneha: మోదరన్ డ్రెస్సులు స్నేహ…చెక్కుచెదరని అంటోన్న అభిమానులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి