Sneha: మోడరన్ డ్రెస్సులో స్నేహ.. చెక్కుచెదరని అందమంటూ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్

Sneha Instagram Photos: ప్రియమైన నీకు సినిమాతో మనకు పరిచయమైన హీరోయిన్ స్నేహ. సౌందర్య తరువాత మళ్లీ అంత పద్ధతిగా కనిపించి.. సౌత్ ఇండస్ట్రీలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ…

  • Jan 07, 2024, 19:51 PM IST
1 /6

తన నవ్వుతోనే ఒకప్పుడు ఎంతోమంది సినీ ప్రేక్షకులను ఫిదా చేసిన హీరోయిన్ స్నేహ. ఎక్స్పోజింగ్ చేయకుండా కూడా అభిమానులను సంపాదించుకోవచ్చు అని ఈ హీరోయిన్ మరోసారి రుజువు చేసింది.

2 /6

మంచి మంచి పాత్రలు చేస్తూ.. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ప్రియమైన నీకు సినిమా నుంచి సంక్రాంతి సినిమా వరకు దాదాపు స్నేహ చేసినవన్నీ చాలా పద్ధతి అయిన పాత్రలే.

3 /6

అయితే కొద్ది సంవత్సరాల క్రితం ప్రసన్నా ని పెళ్లి చేసుకున్న స్నేహ.. హీరోయిన్ పాత్రలకు దూరం అవుతూ వచ్చింది. ప్రస్తుతం కేవలం అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో కనిపిస్తోంది. 

4 /6

ఈమధ్య తెలుగులో సన్నాఫ్ సత్యమూర్తి, వినయ విధేయ రామలాంటి చిత్రాల్లో ముఖ్యమైన పాత్రలతో అలరించింది.

5 /6

ఈ నేపథ్యంలో స్నేహ మోడ్రన్ డ్రెస్సులో తాజాగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. రెడ్ వైన్ రంగులో…స్టైలిష్ పోజులు ఇస్తూ స్నేహా దిగిన ఫోటోలు ప్రస్తుతం అందరిని తెగ ఆకట్టుకుంటున్నాయి.

6 /6

ఎప్పుడు పద్ధతిగా కనిపించే స్నేహ ఇలా స్టైలిష్ డ్రెస్ లో హాట్ ఫోటోషూట్ ఇవ్వడంతో.. సినీ ప్రేక్షకులు మళ్లీ స్నేహ హీరోయిన్ క్యారెక్టర్లకు ట్రై చేస్తుందేమో.. ఎందుకంటే తన అందం ఇంకా చెక్కుచెదరనే లేదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.