SVP title Song: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న 'సర్కారు వారి పాట' టైటిల్ సాంగ్ కాసేపటి క్రితమే యూట్యూబ్‌లో విడుదలైంది. తమన్ సంగీతం అందించిన ఈ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 'సరా సరా సర్కారు వారి పాట... షురూ షురూ అన్నాడురా అల్లూరి వారి బేటా...' అంటూ సాగే లిరిక్స్ కనెక్టింగ్‌గా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన కళావతి, పెన్నీ సాంగ్స్ సూపర్ హిట్టవగా... తాజా టైటిల్ సాంగ్ కూడా యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


'సర్కారు వారి పాట' టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు పాటలు సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. బ్యాంకింగ్ మోసాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని చెబుతున్నారు. అయితే దర్శకుడు పరశురాం కానీ మేకర్స్ కానీ సినిమా కథకు సంబంధించి ఇప్పటివరకూ ఏ విషయం బయటకు వెల్లడించలేదు.


మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటిస్తున్న ఈ సినిమాలో సముద్రఖని, వెన్నెల కిశోర్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తవగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. 


Also Read: DC Vs RR: 'నో బాల్' కోసం పంత్ 'పంతం'.. చివరి ఓవర్‌లో హైడ్రామా... గల్లీ క్రికెట్‌ను తలపించిన ఐపీఎల్ మ్యాచ్...  


Also Read: Flipkart Sale: ఫ్లిప్ కార్ట్ లో సూపర్ సేల్.. రూ.559లకే Redmi Note 10T స్మార్ట్ ఫోన్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.