Mahesh babu poster: ఆకట్టుకుంటున్న మహేశ్ బాబు కొత్త పోస్టర్, సర్కారు వారి పాటలో మహేశ్ రఫ్ లుక్

Mahesh babu poster: మహేశ్ బాబు అభిమానులకు శుభవార్త. ఉగాది పురస్కరించుకుని సర్కారువారిపాట యాక్షన్ పోస్టర్ విడుదలైంది. రఫ్ లుక్ తో ఉన్న మహేశ్ బాబు పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంటోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 3, 2022, 06:08 AM IST
Mahesh babu poster: ఆకట్టుకుంటున్న మహేశ్ బాబు కొత్త పోస్టర్, సర్కారు వారి పాటలో మహేశ్ రఫ్ లుక్

Mahesh babu poster: మహేశ్ బాబు అభిమానులకు శుభవార్త. ఉగాది పురస్కరించుకుని సర్కారువారిపాట యాక్షన్ పోస్టర్ విడుదలైంది. రఫ్ లుక్ తో ఉన్న మహేశ్ బాబు పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంటోంది.

పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు యాక్షన్,  ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సర్కారు వారి పాట ఈ ఏడాది విడుదలవుతున్న మోస్ట్ ఎవైటెడ్ చిత్రాలలో ఒకటి. వేసవిలో సినిమా అభిమానులకు సూపర్ స్పెషల్ ట్రీట్‌ను అందించేందుకు ఈ చిత్రాన్ని మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఉగాది సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, చిత్ర నిర్మాతలు స‌రికొత్త  యాక్షన్-ప్యాక్డ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. మహేశ్ బాబుపై గూండాలు ఆయుధాలతో దాడికి సిద్ధపడుతుండ‌గా. సూపర్ స్టార్ తన బెల్ట్ తీస్తూ, వారిపై దాడికి సిద్ధంగా వున్నాడు. ఈ గెట‌ప్‌లో మ‌హేష్ కూల్‌గా, మోడిష్‌గా కనిపిస్తున్నా దాడి చేయ‌డానికి ధృడంగా వున్న‌ట్లు అత‌ని లుక్ తెలియ‌జేస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన రెండు పాట‌ల‌కు అద్భుతమైన స్పందన రావడంతో మ్యూజికల్ ప్రమోషన్‌లు కూడా జోరందుకున్నాయి. కళావతి మెలోడీ ప్రేమికులను ఆకర్షించగా, రెండవ ట్రాక్, మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని తొలిసారిగా కనిపించిన పెన్నీకి అద్భుతమైన స్పందన వచ్చింది. సితార డ్యాన్స్‌కు పలువురు మెచ్చుకున్నారు.

ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా..మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై తెరకెక్కింది. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో  కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నాడు. 

Also read: Bimbisara Movie Release Date: క‌ళ్యాణ్ రామ్ బింబిసార మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News