Mahesh Babu: మహేష్ బాబు పుత్రోత్సాహాం.. కుమారుడితో సూపర్ స్టార్ పిక్ వైరల్..
Mahesh Babu: పుత్రోత్సాహాము..తండ్రికి పుత్రుడు జన్మించినపుడు కాదు..ఆ పుత్రుడిని నలుగురు పొగిడినపుడే సంతోషం కలుగుతోంది. ప్రస్తుతం మహేష్ బాబు అదే తన కుమారుడు విషయంలో అదే అనుభవిస్తున్నాడు.
Mahesh Babu: మహేష్ బాబు ప్రస్తుతం పుత్రోత్సాహాంతో ఫుల్ ఖుషీలో ఉన్నాడు. తాజాగా తన కుమారుడు గౌతమ్ కృష్ణ.. కాన్వకేషన్‌కు హాజరైన మహేష్ బాబు తన కుమారుడు గౌతమ్ కృష్ణతో కలిసి దిగిన ఫోటొ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో మహేష్ బాబు అంత హైట్‌తో చాలా క్యూట్‌గా ఉన్నాడు. అభిమానులు కాబోయే ఫ్యూచర్ సూపర్ స్టార్ అంటూ గౌతమ్ కృష్ణ ఎపుడు వెండితెర ఎంట్రీ ఇస్తాడా ? అని కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు కుమారుడు.. గౌతమ్..సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'నేనొక్కడినే' మూవీతో వెండితెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత చదవు కోసం సినిమాలకు దూరంగా ఉన్నాడు. రాజమౌళితో చేయబోయే సినిమాలో కొత్త లుక్ కోసం మహేష్ బాబు ట్రై చేస్తున్నాడు. కొన్ని రోజుల ముందు వరకు ఈ లుక్ ఎక్కడా రివీల్ కాకుండా జాగ్రత్త పడ్డా.. తీరా కుమారుడు కాన్వకేషన్ కోసం రావడంతో మహేష్ బాబు తాజా లుక్ వైరల్ అవుతోంది. ఈ లుక్‌లో మహేష్ బాబు పెరిగిన జుట్టు, గడ్డంతో కొత్త డిఫరెంట్ లుక్‌లో కనిస్తున్నాడు. ఇక రాజమౌళితో చేయబోయే సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన ఈ నెల 31న సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే రోజున అఫీషియల్‌గా ప్రకటించనున్నారు. ఇక మహేష్ బాబు పుట్టినరోజైన ఆగష్టు 10న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది.
మహేష్ బాబు .. సినిమాకు సంబంధించి విజయేంద్ర ప్రసాద్ ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఈ సినిమాను తెరెక్కిస్తున్నారు. ఇందులో మహేష్ బాబు తప్ప మరే ఇతర నటీనటులు ఫైనలైజ్ కాలేదు. త్వరలోనే ఆ విషయాలను మీడియాతో పంచుకోన్నారు. ఈ సినిమాను శ్రీదుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె.యల్. నారాయణ భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. దాదాపు రూ. 200 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో భారీ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ఈ సినిమా రానుంది.
మహేష్ బాబు రీసెంట్‌గా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గుంటూరు కారం' సినిమా చేసాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఓ మోస్తరు విజయం సాధించింది. సంక్రాంతి సీజన్‌లో బ్యాడ్ టాక్‌తో కూడా దాదాపు రూ. 200 కోట్లు రాబట్టి హీరోగా మహేష్ బాబు స్టామినా ఏంటో అందరికీ తెలిసేలా చేసింది.
Also read: Remal Cyclone Alert: ఇవాళ తీరం దాటనున్న రెమల్ తుపాను, ఏపీలో రెండ్రోజులు వర్షసూచన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook