Rajamouli - Mahesh Babu: రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు కొత్త లుక్ వైరల్..
Rajamouli - Mahesh Babu: రీసెంట్‌గా గుంటూరు కారం సినిమాలో పోకిరి తరహా వింటేజ్ లుక్‌లో కనిపించి అభిమానులను కనువిందు చేసాడు మహేష్ బాబు. ఇక త్వరలో పట్టాలెక్కనున్న రాజమౌళి కొత్త లుక్‌లో కనిపించబోతన్నాడు. ఆ లుక్ ఇదే అంటూ ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
Rajamouli - Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక బాహుబలి రాజమౌళి కాంబో కోసం కొన్నేళ్లుగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. త్వరలో వీళ్లిద్దరి కాంబినేషన్ మూవీ పట్టాలెక్కనుంది. ఇప్పటికే రాజమౌళి తండ్రి రచయత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాను కథను రెడీ చేసారు. మరో వైపు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలుపెట్టేసారు రాజమౌళి. ఈ సినిమాలో పాత్ర కోసం మహేష్ బాబు స్పెషల్‌గా ట్రెయిన్ కూడా అవుతున్నాడు. రాజమౌళి సినిమా అంటనే యాక్షన్ కమ్ అడ్వెంచరస్ కు కేరాఫ్ అడ్రస్. అందుకే మహేష్ బాబు జర్మనీ వెళ్లాడు. అక్కడ ఫేమస్ ట్రెయినలర్ హ్యారీ కొనిగ్‌తో కలిసి ట్రెక్కింగ్ చేస్తున్న చేస్తోన్న ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకోవడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అంతేకాదు కొన్ని యాక్షన్స్ సీన్స్ కోసం ప్రత్యేకంగా సిద్దమవుతన్నాడు. ఈ సినిమా కోసం మహేష్ బాబు భారత్ టూ జర్మనీ తదితర దేశాలకు తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు ఈ సినిమా కోసం కొత్త లుక్‌లో కనిపించబోతున్నట్టు అభిమానులు ఎయిర్ పోర్ట్‌లో ఉన్న మహేష్ బాబు లుక్‌ను షేర్ చేస్తున్నారు.
ఈ సినిమాలో మహేష్ బాబుతో పాటు మరో ముఖ్యపాత్ర ఉందట. ముందుగా ఈ క్యారెక్టర్ కోసం బాలకృష్ణతో పాటు విక్రమ్, కమల్ హాసన్ వంటి సీనియర్ టాప్ హీరోలను అనుకున్నారు. కానీ వర్కౌట్ కాలేదు. తాజాగా ఈ సినిమాలో టాలీవుడ్ మన్మథుడు కింగ్ నాగార్జున ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే నాగార్జునకు విజయేంద్ర ప్రసాద్‌తో పాటు రాజమౌళి కలిసి స్టోరీని నేరేట్ చేసినట్టు సమాచారం. గతంలో విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో చేసిన రాజన్న సినిమాలో యాక్షన్ సీన్స్ కొన్ని జక్కన్న డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. మొత్తంగ రాజమౌళి సినిమాలో ఛాన్స్ అనగానే ఏం ఆలోచించకుండా నాగ్ వెంటనే ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పినట్టు సమాచారం.
నాగార్జునకు తెలుగు, తమిళం సహా ప్యాన్ ఇండియా లెవల్లో మంచి ఫాలోయింట్ ఉంది. యేడాదిన్నర క్రితం రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ హీరో, హీరోయిన్లుగా నటించిన 'బ్రహ్మాస్త్ర'లో నాగార్జున కీ రోల్ పోషించిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు తాజాగా మహేష్ బాబు, రాజమౌళి ప్యాన్ ఇండియా మూవీలో నాగార్జున భాగం కాబోవడం కన్ఫామ్ అని చెప్పొచ్చు. త్వరలో ఈ విషయమై అఫిషియల్ ప ప్రకటన వెలుబడాల్సి ఉంది. ఇక ఈ సినిమా నిర్మాత కే.ఎల్. నారాయణతో కూడా నాగార్జునకు మంచి అనుబంధమే ఉంది. ఈయన నిర్మాణంలో గతంలో హలో బ్రదర్, సంతోషం వంటి చిత్రాలు కూడా చేసాడు. ఈ నేపథ్యంలో నాగార్జున రాజమౌళి, మహేష్ బాబు సినిమాలో నటించడం దాదాపు ఖాయమనే చెప్పాలి. రీసెంట్‌గా నాగార్జున.. సంక్రాంతి బరిలో 'నా సామిరంగ' మూవీతో పలకరించాడు. అటు మహేష్ బాబు..గురుజీ తెరకెక్కించిన గుంటూరు కారంతో పలకరించారు. ఈ రెండు చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి.
Also Read: Revanth Vs Harish Rao: తెలంగాణలో జల యుద్ధం.. రేవంత్ కాస్కో అంటూ సవాల్ విసిరిన హరీశ్ రావు
Also Read: CM Revanth Reddy: ఒక్క నిమిషం కూడా మైక్ కట్ చేయం.. కేసీఆర్, కేటీఆర్ లకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook