Mahesh Babu on RRR Movie: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్​ఆర్​ఆర్​' (రణం రౌద్రం రుధిరం) సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలై.. బ్లాక్ బాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటించగా.. కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తెరపై కనిపించారు. వీరిద్దరూ తెరపై కనిపించి సందడి చేయగా.. వీరి నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"భారీ బడ్జెట్ చిత్రం విడుదల సందర్భంగా 'ఆర్ఆర్ఆర్' టీమ్ మొత్తానికి హ్యాట్సాఫ్. చాలా గర్వంగా ఉంది. తారక్, చరణ్ వారి పరిమితులకు మించి అత్యుత్తమంగా నటించారు. ముఖ్యంగా నాటు నాటు పాటలో వీరిద్దరూ భూమి మీద స్టెప్పులేస్తున్నట్లు లేదు. గాల్లో ఎగురుతూ డ్యాన్స్ చేసినట్లు నాకు అనిపించింది" అని మహేష్ బాబు ట్వీట్ చేశారు. 



అదే విధంగా.. "రాజమౌళి తెరకెక్కించిన మంచి సినిమాలు చాలా ఉన్నాయి. కానీ, ఆర్ఆర్ఆర్ అద్భుతం. భారీగా, అద్భుమైన విజువల్స్, గుండెల్ని పిండేసే భావోద్వేగాలు ఊహించని స్థాయిలో ఉన్నాయి. సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో మనల్ని మనమే మర్చిపోయే విధంగా ఉన్నాయి. అది దర్శకుడు రాజమౌళికే సాధ్యం" అని మహేష్ బాబు కొనియాడారు.  


Also Read: RRR Movie Leaked Online: RRR మూవీకి తప్పని పైరసీ బెడద.. ఆన్ లైన్ లో ఫుల్ HD ప్రింట్?


Also Read: Ram Charan Boxing: RRR మూవీ ఆ ఒక్క సీన్ కోసం రామ్ చరణ్ ఎంత కష్టపడ్డాడో చూడండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook