Ram Charan Boxing: RRR మూవీ ఆ ఒక్క సీన్ కోసం రామ్ చరణ్ ఎంత కష్టపడ్డాడో చూడండి!

Ram Charan Boxing: రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్' శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెరపై అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్ గా ఎన్టీఆర్ నటించి మెప్పించారు. అయితే దాని వెనుక ఎంతో కష్టం దాగుంది. సినిమాలో రామ్ చరణ్ బాక్సింగ్ చేసే సన్నివేశాలు ఉన్నాయి. వాటి కోసం చెర్రీ ఎలా కష్టపడ్డాడో చూడండి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 25, 2022, 04:35 PM IST
Ram Charan Boxing: RRR మూవీ ఆ ఒక్క సీన్ కోసం రామ్ చరణ్ ఎంత కష్టపడ్డాడో చూడండి!

Ram Charan Boxing: దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' శుక్రవారం థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటించారు. అయితే ఈ చిత్రంలో ప్రత్యేకంగా రామ్ చరణ్ లుక్.. టీజర్ లో బాక్సింగ్, ట్రైలర్ లో విలువిద్య గురించి ఆయన ఫ్యాన్స్ ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. ఈ మూవీ కోసం అటు తారక్ తో పాటు ఇటు రామ్ చరణ్ కూడా పూర్తిగా మేక్ ఓవర్ అయ్యాడు. పోలీసుగా లాఠీ పట్టడం సహా విలువిద్య నేర్చుకొని.. ఫ్యాన్స్ ను అబ్బురపరిచాడు. 

ఈ మూవీ రిలీజ్ సందర్భంగా రామ్ చరణ్ కు బాక్సింగ్ లో ట్రైనింగ్ ఇచ్చిన నీరజ్ గోయత్.. ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. రామ్ చరణ్ బాక్సింగ్ చేస్తున్న దృశ్యాలు అందులో ఉన్నాయి. 

ఆర్ఆర్ఆర్ మూవీ కోసం రామ్ చరణ్ బాగా కష్టపడ్డాడని నీరజ్ గోయత్ ట్వీట్ చేశాడు. చరణ్ కష్టపడి నేర్చున్న బాక్సింగ్ కొద్ది సన్నివేశాల్లో ఉన్నా.. ప్రాణం పెట్టి నటించిన నటన తనను మెప్పించిందని నీరజ్ అన్నాడు. ఇంకెందుకు ఆలస్యం ఆర్ఆర్ఆర్ సినిమా కోసం తనను తాను ఎలా మార్చుకున్నాడో మీరే చూసేయండి! 

Also Read: RRR Mania: తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ మానియా.. థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి!

Also Read: RRR Collection in USA: ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్.. USA ప్రీమియర్స్ లో 3 మిలియన్ డాలర్లు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్

Trending News