Mahesh babu: రాజమౌళి సినిమా కోసం జర్మనీ అడవుల్లో మహేష్ బాబు సాహసాలు..
Mahesh Babu: రాజమౌళి, మహేష్ బాబు సినిమా సూపర్ స్టార్ అభిమనులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. వాళ్ల ఎదురు చూపులు ఫలించే రోజులు దగ్గర పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథతో పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు స్పెషల్‌గా ట్రెయిన్ అవుతున్నాడు.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్‌గా 'గుంటూరు కారం' సినిమాతో పలకరించారు. ఈ మూవీ బ్యాడ్ టాక్ తో కూడా మంచి వసూళ్లనే రాబట్టింది.ఫస్ట్ డే మహేష్ బాబు ఇమేజ్‌తో పాటు త్రివిక్రమ్ స్టార్ డమ్ వంటివి ఈ చిత్రానికి బాగానే కలిసొచ్చి సాలిడ్ వసూళ్లను రాబట్టింది.అంతేకాదు రూ. 90 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో నాన్ ప్యాన్ ఇండియా క్యాటగిరిలో హైయ్యెస్ట్ ఫస్ట్ డే వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. మరోవైపు ఈ సినిమాకు పోటీగా విడుదలైన హనుమాన్ మూవీ సూపర్ పాజిటివ్ టాక్ తెచ్చుకొని సాలిడ్ వసూళ్లతో సంక్రాంతి సినిమాల్లో హైయ్యెస్ట్ షేర్ కమ్ గ్రాసర్ మూవీగా రికార్డులకు ఎక్కింది. మొత్తంగా బాక్సాఫీస్ దగ్గర హనుమాన్ సినిమా దూకుడును సైతం తట్టుకుంటూ ఓన్లీ మహేష్ బాబు ఇమేజ్ కారణంగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబట్టింది.మరోవైపు ఈ సినిమాకు ఈ ఫలితం రావడంపై అందరు గురూజీ వైపు వేలెత్తి చూపెడుతున్నారు.
మొత్తంగా మహేష్ బాబు ఇమేజ కారణంగా ఈ మూవీ 90 శాతం రికవరీ అయింది. ఈ మూవీలో మహేష్ బాబును కొత్తగా చూపించడంతో పాటు డాన్సులు అభిమానులను అలరించాయి. ఈ మూవీ తర్వాత మహేష్ బాబు రాజమౌళి సినిమా చేయనున్నాడు. ఈ సినిమా కోసం సూపర్ స్టార్ ప్రత్యేకంగా ట్రెయిన్ కానున్నాడు. ఈ సినిమా స్టంట్స్ యాక్షన్ సీన్స్ కోసం మహేష్ బాబు జర్మనీ వెళ్లాడు. అక్కడ ప్రముఖ వ్యాయామ నిపుణులు హ్యారీ కొనిగ్‌తో కలిసి ట్రెక్కింగ్ చేస్తున్నాడు. అంతేకాదు కొన్ని యాక్షన్స్ సీన్స్ లో ట్రెయిన్ అవుతున్నాడు. దానికి సంబంధించి ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకున్నాడు మహేష్ బాబు.
ఈ సినిమాను డాక్టర్ కే.ఎల్. నారాయణ భారీ ఎత్తున నిర్మించనున్నాడు. విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నారు. ఈ సినిమా ఇండియానా జోన్స్ ఆధారంగా యాక్షన్ అండ్ అడ్వెంచరెస్ మూవీగా తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాను రాజమౌళి ఈ యేడాది సెట్స పైకి తీసుకెళ్లి వచ్చే యేడాది ద్వితీయార్ధంలో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు.
Also read: CAA in India: సీఏఏపై మళ్లీ వివాదం, వారం రోజుల్లో అమలు చేస్తామని కేంద్ర మంత్రి వ్యాఖ్యలు
Also Read: Sharmila Meets Sunitha: షర్మిల మరో సంచలనం.. వివేకా కూతురు సునీతతో భేటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.