Mahesh Babu Remuneration: టాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోల్లో మహేష్ బాబు కూడా ఒకరు. ప్రస్తుతం మహేష్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం మూవీ చేస్తున్నాడు. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ మూవీ తర్వాత రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇది మహేష్ కెరీర్ లో 29వ సినిమా. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ఏప్రిల్ లో ప్రారంభం కానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీకి గ్లోబల్ లెవల్లో ఎంతో హైప్ నెలకొని ఉంది. అయితే ఈ సినిమా కోసం మహేష్ బాబు భారీ రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా కోసం మహేష్ ఏకంగా రూ.110 కోట్లు రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. వీరిద్దరూ కాంబోలో సినిమా అంటేనే ఆడియెన్స్ లో భారీగానే అంచనాలు ఉన్నాయి. 


ప్రిన్స్ మహేష్ సినిమా సినిమాకు తన పారితోషికాన్ని పెంచుకుంటూ వెళ్తున్నాడు. ప్రస్తుతం గుంటూరు కారం మూవీ కోసం రూ.78 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. ఇప్పడు ఏకంగా రూ.100 కోట్ల మార్కునే దాటేస్తున్నాడు. మహేష్ సర్కారు వారి పాట కోసం రూ.50 కోట్లు అందుకున్నాడు. అంతకముందు సరిలేరు నీకెవ్వరు సినిమా కోసం రూ.40 కోట్లు అందుకున్నాడు. 


Also Read: Chinna Movie OTT: ఓటీటీలోకి రాబోతున్న సిద్ధార్థ్‌ 'చిన్నా'... స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..