SVP Story: `సర్కారు వారి పాట`... కథలో అసలు పాయింట్స్ రివీల్ చేసిన ఎడిటర్...
Editor Marthand K Venkatesh on SVP: మహేష్ బాబు అప్‌కమింగ్ మూవీ `సర్కారు వారి పాట` కథ గురించి ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేశ్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
Editor Marthand K Venkatesh on SVP: మహేష్ బాబు-కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయిపోయింది. మే 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మే 2న చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ అప్పుడే ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ప్రముఖ సినీ ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేశ్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
'సర్కారు వారి పాట' కథ గురించి చెబుతూ... పోకిరి, గీత గోవింద సినిమాలను కలిపితే ఈ సినిమా అవుతుందన్నారు. సినిమాలో చాలా మందికి కనెక్ట్ అయ్యే బలమైన మెసేజ్ ఉందన్నారు. సినిమా ఫస్టాఫ్ యూత్‌ను మెప్పించేలా హీరో, హీరోయిన్ల మధ్య మంచి కెమిస్ట్రీతో కూడిన సీన్స్ ఉంటాయని చెప్పారు. ఫస్టాఫ్‌లో చాలా సీన్స్ ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తాయన్నారు. సెకండాఫ్‌లో వచ్చే సీన్స్ ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కట్టిపడేస్తాయన్నారు.
సినిమా రషెస్ చూసినప్పుడు మహేష్ క్యారెక్టరైజేషన్ పోకిరితో పోలిస్తే నెక్స్ట్ లెవల్‌లో ఉన్నట్లు అనిపించిందన్నారు మార్తాండ్ కె వెంకటేశ్. 'గీత గోవిందం' షూటింగ్ సమయంలోనే పరశురాం తనకు ఈ కథ గురించి చెప్పారని తెలిపారు. పరశురామ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచి తనకు తెలుసునని... ఆయనలోని రచయిత అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. పరశురామ్ సినిమాల్లో ప్రేమ కథలు, కుటుంబ సన్నివేశాలు ప్రేక్షకులను అలరించేలా ఉంటాయన్నారు.
సర్కారు వారి పాట నుంచి ఇప్పటికే విడుదలైన కళావతి, పెన్నీ, టైటిల్ సాంగ్స్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే. సినిమా ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. సినిమాలో మహేష్ అల్ట్రా స్టైలిష్‌గా కనిపిస్తుండటంతో వెండి తెరపై ఆయన్ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలో వెన్నెల కిశోర్, సుబ్బరాజు, సముద్రఖని తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రీ మూవీస్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా మార్తాండ్ కె వెంకటేశ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
Also Read: Ramya Murder Case Verdict: దిశ చట్టం పవర్ ఇదే..21 రోజుల్లోనే ఉరిశిక్ష విధించొచ్చు
Also Read: Minister KTR on AP: ఏపీపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ వివరణ... ఏం చెప్పారంటే...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook