Sarkaru vaari paata collection prediction : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం 'సర్కారు వారి పాట'. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ల పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ చంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ సినిమా కోసం కోసం ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సర్కారు వారి పాట ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక  ట్రైలర్ ఆల్ టైం రికార్డ్ ని సృష్టించి సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే అంచనాలని మరింత పెంచింది. బ్లాక్ బస్టర్ దర్శకుడు పరశురాం అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దిన సర్కారు వారి పాట మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదల కాబోతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సర్కారు వారి పాట చిత్రం తొలి రోజు రూ.50కోట్ల వరకు వసూళ్లు సాధిస్తుందని తెలుస్తోంది. ఓవర్సీస్‌లో కూడా వసూళ్లు రికార్డు స్థాయిలో ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే అన్ని రీజన్స్‌లో కలిపి రూ.10కోట్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వసూలు చేసినట్లు తెలుస్తోంది.


ఇప్పటికే ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 వంటి సినిమాల తరహాలోనే ఈ సర్కారు వారి పాట చిత్రానికి సైతం టికెట్ల ధరలు పెంచుకునేందుకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. దీంతో వసూళ్లలో చెప్పుకోదగిన పెరుగుదల కనిపించిందని ట్రేడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు అడ్వాన్స్ బుకింగులు సైతం జోరుగా సాగుతున్నాయి. అంచనాలు అందుకునే దిశగానే ఈ మూవీ పయనిస్తోందని చెప్తున్నారు. 


సరిలేరు నీకెవ్వరు తర్వాత దాదాపు రెండున్నరేళ్ల తర్వాత మహేశ్‌బాబు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. చాలా వాయిదాల తర్వాత చివరకు ఈ గురువారం విడుద కానుంది. టికెట్ ధరలు పెంచిన తర్వాత కూడా సర్కారు వారి పాట బుకింగ్స్ హైదరాబాద్‌లో జోరుగా సాగాయి. అడ్వాన్స్ బుకింగ్స్‌లో కేజీఎఫ్‌2ను సైతం ఇక్కడ మించిపోయింది సూపర్ స్టార్ మూవీ. హైదరాబాద్‌లో అత్యధిక అడ్వాన్స్ బుకింగ్స్ సాధించిన చిత్రంగా ఆర్ఆర్ఆర్ రికార్డుల్లో టాప్‌ పొజిషన్‌లో ఉండగా... ఇప్పటి వరకు ఆ తర్వాత స్థానంలో నిలిచిన కేజీఎఫ్‌2ను సైతం మించిపోయింది సర్కారు వారి పాట. అడ్వాన్స్ బుకింగ్స్‌లో టాప్ 5 సినిమాలివే...


1. RRR(ఆర్‌ఆర్ఆర్) (₹236 Single Screen / ₹413 Multiplexes) 10.89 Crore
2. Sarkaru Vaari Paata (సర్కారు వారి పాట) (₹210 Single Screen /₹354 Multiplexes)  ₹7.2 Crore
3. KGF Chapter2 (కేజీఎఫ్ 2) (₹210 Single Screen /₹354 Multiplexes) ₹6.57 Crore
4. Bheemla Nayak (భీమ్లా నాయక్) (₹177 Single Screen /₹295 Multiplexes) ₹6.30 Crore
5. Radhe Shyam (రాధే శ్యామ్) (₹177 Single Screen /₹295 Multiplexes) ₹6.21 Crore


Also Read -


Also Read -


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook