Mahesh Babu starrer SVP Pre-Release Event Date: టాలీవుడ్ సూపర్ స్టార్ మ‌హేష్ బాబు నుంచి సినిమా వ‌చ్చి రెండేళ్లు దాటింది. 2020 జనవరిలో 'సరిలేరు నీకెవ్వరూ' తర్వాత మహేష్ నుంచి మరో సినిమా రాలేదు. దాంతో సూపర్ స్టార్ ఫాన్స్ 'సర్కారు వారి పాట' చిత్రం విడదల కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. డైరెక్టర్ ప‌రుశురాం దర్శకత్వంలో మ‌హేష్ బాబు హీరోగా తెరకెక్కిన సినిమా సర్కారు వారి పాట. ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకున్న ఈ సినినిమా.. మే 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్ర‌మోషన్ కార్యక్రమాలలో జోష్ పెంచింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మ‌హేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'సర్కారు వారి పాట' చిత్రం ప్రీ రిలీజ్ వేడుక తేదీని చిత్ర యూనిట్ కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ ప్రీ రిలీజ్ వేడుక‌ను మే 7న జ‌రుప‌నున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. యూస‌ఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు స్టార్ డెరెక్ట‌ర్ పూరీ జగన్నాథ్ రానున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వస్తున్నాయి. దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక సమాచారం అయితే లేదు. 


'సర్కారు వారి పాట' చిత్రంలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఎస్‌ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ సంయుక్తంగా నిర్మించాయి. బ్యాంకు కుంభకోణం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఎస్‌వీపీలో సముద్రఖని, నదియా, వెన్నెల కిశోర్‌, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు.  


'గీతా గోవిందం' తర్వాత పరశురామ్ తెరకెక్కించిన చిత్రం కావడం ఒకవైపు.. 'సరిలేరు నీకెవ్వరూ' తర్వాత మహేష్ బాబు నుంచి వస్తున్న సినిమా కావడం మరోవైపు ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచింది. ట్రైలర్ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది. మహేశ్ డైలాగ్స్, ప‌రుశురాం టేకింగ్, కీర్తి సురేశ్‌ అందాలు, వెన్నల కిషోర్ టైమింగ్ అద్భుతంగా ఉన్నాయి.  


Also Read: Yashoda First Glimpse: ఆసుపత్రి బెడ్‌పై సమంత.. కిటికీలోంచి చేయి పెట్టి..!


Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీని లాగి కొట్టిన చెన్నై బౌలర్.. సీన్ కట్ చేస్తే..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.