Virat Kohli: విరాట్ కోహ్లీని లాగి కొట్టిన చెన్నై బౌలర్.. సీన్ కట్ చేస్తే..!

RCB vs CSK, Mukesh Choudhary hits Virat Kohli with ball. అంతర్జాతీయ స్థాయిలో ఒక్క మ్యాచ్ కూడా ఆడని చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ ముఖేష్ చౌదరి.. ప్రపంచ అత్యుత్తమ బ్యాటర్ విరాట్ కోహ్లీని కొట్టడమేంటని అనుకుంటున్నారా?. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 5, 2022, 11:24 AM IST
  • విరాట్ కోహ్లీని లాగి కొట్టిన చెన్నై బౌలర్
  • సారీ బ్రో అన్నటుగా చేయితో సైగ
  • విరాట్‌ కోహ్లీనే కొడతావా?
Virat Kohli: విరాట్ కోహ్లీని లాగి కొట్టిన చెన్నై బౌలర్.. సీన్ కట్ చేస్తే..!

CSK Pacer Mukesh Choudhary hits RCB Batter Virat Kohli with ball: టీమిండియా మాజీ కెప్టెన్, రికార్డుల రారాజు, ప్రపంచ అత్యుత్తమ బ్యాటర్ విరాట్ కోహ్లీని కొట్టే దమ్ము ఎవరికుంటుంది. కోహ్లీని చూస్తే సలాం కొట్టేవారే ఉంటారు కానీ.. కొట్టేవారు ఎవరుంటారు చెప్పండి. అలాంటిది అంతర్జాతీయ స్థాయిలో ఒక్క మ్యాచ్ కూడా ఆడని చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ కొట్టడమేంటని అనుకుంటున్నారా?. మరేమీ లేదండి చెన్నై పేసర్ ముఖేష్ చౌదరి.. కింగ్ కోహ్లీని కొట్టింది బంతితో. అసలు విషయంలోకి వెళితే... 

ఐపీఎల్ 2022లో భాగంగా గురువారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దాంతో బెంగళూరు ఓపెనర్లు ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ క్రీజులోకి రాగా.. చెన్నై పేసర్ ముఖేష్ చౌదరి బౌలింగ్ చేశాడు. తొలి ఓవర్ ఐదవ బంతికి బౌండరీ బాదిన కోహ్లీ.. చివరి బంతిని స్ట్రయిట్ షాట్ ఆడాడు. పరుగు కోసం కోహ్లీ రెండగులు ముందుకు వేయగా.. ముకేశ్ బంతిని అందుకుని వికెట్ల వైపు బలంగా విసిరాడు. అదే సమయంలో వెనక్కి వెళుతున్న విరాట్ ఎడమ తొడకు బంతి బలంగా తాకింది. 

అయితే ముఖేష్ చౌదరి వేసిన త్రో వల్ల విరాట్‌ కోహ్లీకి గాయం కాలేదు. వెంటనే కోహ్లీ వైపు చుసిన ముఖేష్.. సారీ బ్రో అన్నటుగా చేయితో సైగ చేశాడు. పర్లేదు బ్రో అన్నట్టుగా కోహ్లీ కూడా నవ్వుతూ సైగ చేశాడు. ఇందుకు సంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చుసిన తర్వాత విరాట్ అభిమానులు ముఖేష్‌పై చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెన్నై ఫాస్ట్ బౌలర్‌ను ట్రోల్ చేస్తున్నారు. 'విరాట్‌ కోహ్లీనే కొడతావా?', 'ఫోర్ కొట్టాడని.. బంతితో కొట్టి పాగా తీర్చుకున్నావా?' అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

బుధవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 13 పరుగుల తేడాతో చెన్నైపై విజయం సాధించింది. మహిపాల్‌ లామ్రోర్‌ (27 బంతుల్లో 42, 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఫాఫ్ డుప్లెసిస్‌ (22 బంతుల్లో 38, 4ఫోర్లు, సిక్స్‌) రాణించడంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 173 స్కోరు చేసింది. చెన్నై బౌలర్లు మహీశ్‌ తీక్షణ (3/27), మొయిన్‌ అలీ (2/28) ఆకట్టుకున్నారు. లక్ష్యఛేదనలో చెన్నై 8 వికెట్లకు 160 పరుగులు చేసి ఓడింది. డెవాన్‌ కాన్వె (37 బంతుల్లో 56, 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), మొయిన్ అలీ (27 బంతుల్లో 34, 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడినా ఫలితం దక్కలేదు. హర్షల్‌ పటేల్‌ (3/35) మూడు వికెట్లు పడగొట్టాడు. 

Also Read: India Covid 19 Cases: మూడు వేలకు పైగా కొత్త కరోనా కేసులు.. భారీగానే మరణాలు!

Also Read: Hyderabad MMTS: ఎంఎంటీఎస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి టికెట్ ధరల తగ్గింపు...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News