టాలీవుడ్ సూపర్‌ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా సినిమా ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata). గీత గోవిందం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ను తెరకెక్కుతోంది. టాలీవుడ్ ‘ప్రిన్స్’ మహేష్ బాబు (Mahesh Babu)కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. బాలీవుడ్ నుంచి విద్యాబాలన్, దక్షిణాది నటుడు అరవింద స్వామి కీలకపాత్రలు పోషిస్తున్నారు.



 


మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మహేష్ బాబు సహ నిర్మాతగా వ్యవహరిస్తూ సినిమాపై మరింత శ్రద్ధ వహిస్తున్నారని సమాచారం. బ్యాంక్ కుంభకోణం నేపథ్యంలో జరిగే సినిమా దాదాపు నెలన్నర రోజులపాటు అమెరికాలో షూటింగ్ జరుపుకోనుంది. అయితే తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ నెలలో ఈ షూటింగ్ వాయిదా పడింది.



 


సర్కారువారి పాట మూవీ యూనిట్ వచ్చే ఏడాది జనవరిలో అమెరికాకు వెళ్లనున్నట్టు సమాచారం. దాదాపు రెండు నెలలపాటు అమెరికా షూటింగ్ షెడ్యూల్ వాయిదా పడింది. ఆ షెడ్యూల్ పూర్తయిన తర్వాతే భారత్‌లో మిగతా భాగం షూటింగ్ జరుపుకోనుంది. దీంతో సర్కారు వారి పాట ఆలస్యం కానుందని, మూవీ చూసేందుకు మహేష్ బాబు అభిమానులు మరికొన్ని రోజులు అధికంగా వేచి చూడాల్సి ఉంటుంది.



 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe