Mahesh Babu: మహేష్ చిత్రానికి వీసా కష్టాలు?

Visa Trouble for Mahesh Babu | సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీని పరశురామ్ ( Parasuram ) తెరకెక్కిస్తున్నారు

Last Updated : Oct 20, 2020, 10:07 PM IST
    • ప్రిన్స్ సినిమాకు వీసా కష్టాలు
    • వీసా ఎప్పుడు దొరుకుతుందో అప్పుడే అమెరికాకు టీమ్
    • అమెరికాలో 30 షూటింగ్ కోసం టీమ్ సిద్ధం
Mahesh Babu: మహేష్ చిత్రానికి వీసా కష్టాలు?

Mahesh Babu Film Sarkaru Vaari Paata | సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీని పరశురామ్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కీర్తిసురేష్ ( Keerthy Suresh ) కథానాయికగా కనిపించనుంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అవ్వాల్సిఉంది. అయితే చాలా కారణాల వల్ల ఈ మూవీ చిత్రీకరణ ఎప్పుడు ప్రారంభం అవుతుందో స్పష్టత రావడం లేదు. 

అయితే కొన్ని వార్తల ప్రకారం ఈ మూవీ షూటింగ్ అమెరికాలో జరగాల్సి ఉండగా కొన్ని వీసా సమస్యల వల్ల బ్రేక్ పడిందట. సర్కారు వారి పాట ( Sakaru Vaari Paata ) సినిమా ఆమెరికాలో సుమారు నెల పాటు షూటింట్ చేయాల్సి ఉందట. అయితే వీసా పర్మిషన్స్ లో జాప్యం కారణంగా ఇబ్బందులు కలుగుతున్నాయట. 

వీసా ప్రక్రియ ముగిస్తే త్వరగా అమెరికా వెళ్లడానికి టీమ్ సిద్ధంగా ఉంది అని సమాచారం. ఈ మూవీని ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు. సర్కారు వారి పాట సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. 

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News