SSMB 28 Shoot Cancelled: మహేష్‌ బాబు త్రివిక్రమ్ చేస్తోన్న SSMB 28 సినిమా షూటింగ్‌ క్యాన్సిల్ అయినట్టుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నేడు సారథి స్టూడియోలో స్టార్ట్ కావాల్సిన షూటింగ్‌ క్యాన్సిల్ అయినట్టు వార్తలు బయటకు వచ్చాయి. ఎందుకు క్యాన్సిల్ అయిందనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. కానీ నెటిజన్లు మాత్రం భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. త్రివిక్రమ్‌ను ట్రోల్ చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సినిమా షూటింగ్ ఎందుకు క్యాన్సిల్ అయింది.. పవన్ కళ్యాణ్‌ స్క్రిప్ట్‌ పనులు చూసుకునేందుకు త్రివిక్రమ్ వెళ్లాడా..? అంటూ కౌంటర్లు వేస్తున్నారు. మహేష్‌ బాబు ఫ్యాన్స్ మాత్రం గురూజీ మీద గుర్రుగా ఉన్నారు. అసలే సినిమా లేట్ అవుతోందంటే.. పవన్ కళ్యాణ్‌ కోసం రీమేక్‌ స్క్రిప్ట్‌లను రెడీ చేస్తూ తమ హీరో స్క్రిప్ట్‌ను పక్కన పెట్టేస్తున్నాడంటూ మొదటి నుంచి ఆగ్రహంగానే ఉన్నారు.


ఇక అప్డేట్ల విషయంలోనూ త్రివిక్రమ్ యూనిట్ ఏమంతా దూకుడుగా కూడా ఉండటం లేదు. ఉగాదికి అప్డేట్ ఇస్తారని లీకులు వచ్చాయి. కానీ తీరా అప్డేట్లేమీ లేవని, త్వరలోనే వస్తుందని చెప్పుకొచ్చారు. శ్రీరామనవమికి అప్డేట్ ఇస్తామని పరోక్షంగా చెప్పారు. అయితే టైటిల్ విషయంలో ఏకాభిప్రాయం కుదరడం లేదని అందుకే అప్డేట్ లేట్ అవుతోందని టాక్.


అ సెంటిమెంట్ ఫాలో అవుతూ త్రివిక్రమ్ కొన్ని టైటిల్స్ అనుకున్నాడట. ఆమె కథ, అమ్మ కథ, అతడే తన సైన్యం అంటూ ఇలా కొన్ని టైటిల్స్‌ను అనుకుంటూ ఉంటే.. వాటిలో ఒకటి మహేష్‌ బాబుకి నచ్చిందట. ఇంకోటి త్రివిక్రమ్‌కి నచ్చిందట. దీంతో ఈ ఇద్దరూ ఒకే టైటిల్‌ను అనుకోలేకపోవడం వల్లే ఉగాదికి అప్డేట్ మిస్ అయిందని ఇన్ సైడ్ టాక్. 


త్రివిక్రమ్ ఆల్రెడీ పోస్టర్లను, గ్లింప్స్‌ను కూడా రెడీ చేసినట్టుగా టాక్. టైటిల్ ఫిక్స్ అయితే అప్డేట్ ఉగాదికి ఇద్దామని అనుకున్నాడట. ఇప్పుడు టైటిల్ ఓకే కాలేకపోవడంతో ఆ అప్డేట్ శ్రీరామనవమికి వస్తుందని చెప్పేశారు. ఇక ఇందులో శ్రీలీల మహేష్‌ బాబు ట్రాక్ హైలెట్ కానుందట.


Also Read:  Kota Srinivasa Rao : చనిపోయానంటూ వార్తలు.. పోలీసులు వచ్చారు.. కోట శ్రీనివాసరావు వీడియో వైరల్


Also Read: Nani With Anchor Suma: ప్రోమోల కోసం నాని కూడా ఇలా చేస్తున్నాడా?.. అవాక్కైన యాంకర్ సుమ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook