Nani With Anchor Suma @ Suma Adda : బుల్లితెరకు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. ఫ్యామిలీ అంతా థియేటర్లకు రావడం లేదేమో గానీ టీవీల ముందు మాత్రం ఉంటున్నారు. అందుకే సినిమాలను ఎక్కువగా బుల్లితెరలపై ప్రచారం చేస్తున్నారు. బుల్లితెరపై వచ్చే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలకు సినిమా టీం వస్తుంటుంది. ఆడి పాడి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసి తమ సినిమాను ప్రమోట్ చేసుకుంటారు. పండుగలకు స్పెషల్ ఈవెంట్లు ఉంటే వాటిల్లోనూ కనిపిస్తుంటారు.
ఇప్పుడు ఉగాది పండుగ రాబోతోంది. ఈ క్రమంలో దసరా సినిమాను బుల్లితెరపై నాని ప్రమోట్ చేస్తున్నాడు. జీ, స్టార్ మా, ఈటీవీ ఇలా అన్ని చానెల్లలో ఉగాది ఈవెంట్లు వస్తున్నాయి. అన్నింట్లోనూ నాని కనిపించాడు. తన దసరా సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నాడు. అయితే తాజాగా సుమ అడ్డా షోకు సంబంధించిన ప్రోమో వచ్చింది.
ఇందులో నాని కావాలనే కాంట్రవర్సీ కామెంట్లు చేసి ప్రోమో కోసం స్టంట్లు చేయించిందా? అనే అనుమానం కలుగుతోంది. ఇక సుమ షోలోనూ ఈ మధ్య ఈ టీఆర్పీ స్టంట్లు ఎక్కువయ్యాయ్ అన్న సంగతి తెలిసిందే. అయితే నాని ఈ ప్రోమోలో కొన్ని కాంట్రవర్సీ కామెంట్లుచేశాడు. సక్సెస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు సైతం సక్సెస్ కాలేదు కదా? అని నాని అన్నాడు. దసరా సినిమాను తాను అనుకున్నంత బాగా తీయలేదని దర్శకుడు శ్రీకాంత్ గురించి నాని అన్నాడు.
మరి ఇవన్నీ ప్రోమో కోసమేనా? ఎపిసోడ్లో ఇంకా ఏదైనా ట్విస్ట్ ఇచ్చాడా? అన్నది చూడాలి. నాని ఇలా సమాధానాలు చెబుతూ ఉంటే.. సుమ మాత్రం నోరెళ్లబెట్టేసింది. ఇంటికి వెళ్లేటైంలో భర్తలు ఏం తీసుకెళ్తారు అని ఓ ఫన్నీ ప్రశ్న అడిగింది. కర్రీ పాయింట్ నుంచి కర్రీలు అని నాని అంటే.. నువ్ ఎప్పుడూ పూలు పట్టుకెళ్లలేదా? అని సుమ అడిగింది. లేదు అని నాని అంటే.. రాజీవ్‌ని చూసి నేర్చుకో అని సుమ కౌంటర్ వేస్తుంది. ఇలా ప్రోమో సరదాగా సాగిపోయింది.
Also Read: Deepthi Sunaina : బ్లాక్ చేశాడంటూ ఎమోషనల్.. వేడుకుంటోన్న దీప్తి సునయన
Also Read: Niharika Konidela Divorce : ఈ ఒక్క ఫోటోను మాత్రం డిలీట్ చేయని చైతన్య.. నిహారికతో విడాకులు కన్ఫామ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook