Mahesh Babu Wife Namrata మహేష్‌ బాబు భార్య తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలోని లుక్కుని చూస్తే అందరూ ఫిదా అవ్వాల్సిందే అన్నట్టుగా మారింది. నమ్రత శిరోద్కర్‌ ఈ చలికాలంలోని పరిస్థితిని చూపించేసింది. అసలే ఈ చలికాలంలో అందరూ వణికిపోతోన్నారు. బయటి వాతావరణం పూర్తిగా మారిపోయింది. చలి పులిలా రక్కేస్తోంది. అయితే ఈ చలికాలంలో ఇలా రెడీ అవ్వడంటూ నమ్రత తన కొత్త స్వెటర్‌ లుక్కులో దర్శనమిచ్చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



చలి చంపేస్తోంది.. నాలో వేడిని పుట్టించండి అన్నట్టుగా నమ్రత పోస్ట్ వేసింది. ఈ ఫోటోల్లో నమ్రత లుక్కుని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మంటలు పుట్టించేస్తున్నావ్ అని చెబుతున్నట్టుగా ఫైర్ ఎమోజీలను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. ఇక మహేష్‌ బాబు హెయిర్ స్టైలీష్ట్, బాలీవుడ్ స్టైలీష్ట్ ఆలీమ్ ఖాన్ సైతం నమ్రత లుక్కు చూసి ఫైర్ ఎమోజీలను షేర్ చేశాడు. అయితే ఇలానే ఒకసారిగా నమ్రత విత్ అవుట్ మేకప్ పిక్‌ను షేర్ చేసింది. అప్పుడు నెటిజన్లు ట్రోల్ చేశారు. ఇలా అయిపోయారేంటి? అని నెటిజన్లు ట్రోల్ చేసిన దానిపై నమ్రత గట్టిగానే స్పందించింది. 


ఘట్టమనేని ఇంట్లో వరుసగా విషాదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలో ఘట్టమనేని ఇంట్లో ముగ్గురు మరణించారు. రమేష్ బాబు, ఇందిరా దేవీ, సూపర్ స్టార్ కృష్ణ ఇలా వరుసగా మృత్యువాత పడ్డారు. మహేష్‌ బాబుకు దెబ్బ మీద దెబ్బ పడింది. ఇక తన మామ గారు సూపర్ స్టార్ కృష్ణ మరణంపై నమ్రత చేసిన ఎమోషనల్ పోస్ట్ అందరినీ కదిలించేసింది. మిస్ యూ మామ గారు అంటూ నమ్రత వేసిన పోస్ట్‌ ఘట్టమనేని అభిమానులనే కాకుండా అందరినీ ఆకట్టుకుంది.


Also Read : Jabardasth Anchor Sowmya : కనిపించని హైపర్ ఆది.. పెరిగిపోతోన్న జబర్దస్త్ యాంకర్ సౌమ్య క్రేజ్


Also Read : Pooja Hegde : సమంత, రష్మిక, పూజా హెగ్డేలు హీరోయిన్లుగా మారక ముందు చేసిన పనులివే


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook