Mahesh Babu With Dr Harry Konig మహేష్‌ బాబు తాజాగా ఓ డాక్టర్‌ను కలిసినట్టుగా తెలుస్తోంది. డాక్టర్ హ్యారీ కోనిగ్‌ చేతి పడితే ఆరోగ్యం ఎంతో బాగుంటుంది అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. ఆయన కంటే బెటర్‌గా ఎవ్వరూ చూడలేరు అన్నట్టుగా మహేష్‌ బాబు పోస్ట్ వేశాడు. దీంతో మహేష్‌ బాబు అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మహేష్‌ బాబు ఏమై ఉంటుంది? హాస్పిటల్‌కు ఎందుకు వెళ్లాడు.. డాక్టర్‌ను ఎందుకు కలిశాడు? అంటూ అభిమానులు ఆరా తీస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహేష్‌ బాబు వెకేషన్‌లో ఉన్నాడా? షూటింగ్‌లో ఉన్నాడా? అన్నది తెలియనంత వేగంగా కంప్లీట్ చేస్తున్నాడు. అటు చూస్తే వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తుంటాడు.. అంతలోపే షూటింగ్‌లో ప్రత్యక్షం అవుతుంటాడు. మొన్నటి వరకు పారిస్‌లో ఫ్యామిలీతో కలిసి ట్రిప్‌ను ఎంజాయ్ చేశాడు మహేష్‌ బాబు. ఇప్పుడు ఇలా జర్మన్ డాక్టర్‌ను కలిశాడు. అయితే ఆ డాక్టర్ ఇక్కడికి వచ్చాడా?.. మహేష్‌ బాబు అక్కడికి వెళ్లాడా? అన్నది క్లారిటీ లేదు.


 



ఇక మహేష్‌ బాబు ఈ డాక్టర్‌తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. అతని చేతిలో కంటే మరెవ్వరి చేతిలో ఆరోగ్యాన్ని పెట్టలేను.. క్షేమంగా చూసుకోలేరు అన్నట్టుగా మహేష్‌ బాబు పోస్ట్ వేశాడు. అయితే మహేష్‌ బాబు షేర్ చేసిన ఈ ఫోటో, చేసిన పోస్ట్ మీద అభిమానులు రకరకాలుగా ఆలోచిస్తూ తలలు గోక్కుంటున్నారు. అసలేమై ఉంటుందా? అని అనుకుంటున్నారు.


Also Read:  Prabhas Salaar : రెండు పార్టులుగా సలార్!.. సీక్రెట్ రివీల్ చేసిన విలన్ దేవరాజ్


రెగ్యులర్ చెకప్ అని, ఫ్యామిలీ డాక్టర్ అయి ఉంటాడని ఇలా నానా రకాలుగా కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక ఈ డాక్టర్‌ను టాలీవుడ్ నుంచి నమ్రత, ఛార్మీ, సమంతలు కూడా ఫాలో అవుతున్నారు. చూస్తుంటే సెలెబ్రిటీలను ప్రత్యేకంగా ఈ డాక్టర్ ట్రీట్ చేస్తుంటాడని అర్థం అవుతోంది. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్‌ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత రాజమౌళితో కలిసి సినిమాను స్టార్ట్ చేస్తాడు మహేష్‌ బాబు.


Also Read: Samantha Shaakuntalam : శాకుంతలం పరిస్థితి ఇంతలా దిగజారిందా?.. ఇదే నిదర్శనం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook