Prabhas Salaar : రెండు పార్టులుగా సలార్!.. సీక్రెట్ రివీల్ చేసిన విలన్ దేవరాజ్

Prashanth Neel Prabhas Salaar ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతోన్న సలార్ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి వచ్చింది. సలార్ సినిమా ప్రారంభ సమయంలో ఇది ఉగ్రం సినిమాకు రీమేక్ అన్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తరువాత రెండు పార్టులుగా ఈ సినిమా రానుందని అన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 16, 2023, 12:27 PM IST
  • నెట్టింట్లో సలార్ మీద చర్చలు
  • రెండో పార్ట్‌ ఉంటుందన్న విలన్
  • దేవరాజ్ వ్యాఖ్యలతో డార్లింగ్ ఫ్యాన్స్ ఖుషి
Prabhas Salaar : రెండు పార్టులుగా సలార్!.. సీక్రెట్ రివీల్ చేసిన విలన్ దేవరాజ్

Prabhas Salaar Second Part డార్లింగ్ ప్రభాస్ సలార్ సినిమా రెండు పార్టులుగా రానుందనే టాక్ ఎప్పటినుంచో వైరల్ అవుతూనే ఉంది. ఇప్పుడు మరోసారి సలార్ సినిమా మీద, రెండు పార్టులు రానుందనే అనే రూమర్లకు బలం చేకూర్చే వార్త ఒకటి బయటకు వచ్చింది. కన్నడ ప్రముఖ నటుడు, విలన్ దేవరాజ్ సలార్ రెండో పార్ట్ మీద హింట్ ఇచ్చాడు. తన పాత్ర మొదటి పార్ట్ కంటే రెండో పార్ట్‌లోనే ఎక్కువగా ఉంటుందని చెప్పుకొచ్చాడు.

మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ అయితే సలార్ సినిమా ఉగ్రం రీమేక్ అని నోరు జారాడు. అయితే ఇది ఉగ్రం రీమేక్ కాదని తరువాత ప్రశాంత్ నీల్ కప్పిపుచ్చే ప్రయత్నం చేశాడు. అయితే ఇది ఉగ్రం రీమేకా? కాదా? అన్నది మాత్రం క్లారిటీ లేదు. అయితే ఈ సలార్ సినిమా విషయంలో రెండు పార్ట్‌లు అన్నది కూడా రూమర్‌గా బయటకు వచ్చింది. ఈ విషయం మీద ప్రశాంత్ నీల్ కూడా స్పందించాడు. కేజీయఫ్ చాప్టర్ 2 సినిమా ప్రమోషన్స్‌లో చేసిన కామెంట్లు అందరికీ తెలిసిందే.

 

ఒక వేళ రెండు పార్టులుగా ఉంటే.. దాన్ని సరైన టైం, సరైన విధానంలో చెబుతామని ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు సలార్‌లో నటించిన విలన్ దేవరాజ్ అసలు విషయాన్ని నోరు జారి చెప్పేశాడు. విలన్ పాత్రలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన దేవరాజ్ తాజాగా సలార్ గురించి అసలు విషయం చెప్పేశాడు. రెండో పార్టులోనే ప్రభాస్‌తో ఎక్కువగా సీన్లు ఉంటాయని, జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి వారితో కాంబినేషన్ సీన్లున్నాయని చెప్పుకొచ్చాడు.

Also Read:  Taapsee Pannu Bikini : బికినీలో తాప్సీ సెగలు.. పింక్ బ్యూటీ మిర్రర్ సెల్ఫీ వైరల్

బాహుబలి తరువాత ప్రభాస్ అభిమానులకు సరైన సినిమా పడలేదు. ఇండియన్ బాక్సాపీస్ వద్ద సాహో, రాధే శ్యామ్ వంటి సినిమాలు అంతగా ప్రభావాన్ని చూపించలేదు. అయితే బాహుబలి తరువాత ప్రభాస్‌కు సలార్ సినిమానే సరైన కమర్షియల్ అని అంతా భావిస్తున్నారు. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రభాస్, ప్రశాంత్ నీల్‌లు సునామినీ సృష్టిస్తారని అంతా ఫిక్స్ అయ్యారు. ఈ సినిమా ఈ ఏడాదికే థియేటర్లో సందడి చేయనుంది. ఈ మూవీలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించిన విషయం విదితమే.

Also Read: Sekhar Master : తండ్రిని తలుచుకుంటూ కంటతడి.. యాంకర్ ప్రదీప్, శేఖర్ మాస్టర్ ఎమోషనల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News