ప్రామిస్ చేస్తే మాట తప్పను అంటున్న `భరత్`
ఈ టీజర్ భరత్ అనే నేను సినిమనాపై అంచనాలను రెట్టింపు చేసేలావుంది.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌లో ఒకరైన కొరటాల శివ దర్శకత్వంలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న 'భరత్ అనే నేను' సినిమా టీజర్ ఇవాళ ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఏప్రిల్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న ఈ సినిమా టీజర్‌ను 'ది విజన్ ఆఫ్ భరత్' పేరుతో ఇవాళ విడుదల చేశారు. ఈ టీజర్ భరత్ అనే నేను సినిమనాపై అంచనాలను రెట్టింపు చేసేలావుంది. ఇప్పటికే కొరటాల కాంబినేషన్‌లో వచ్చిన శ్రీమంతుడు సినిమా మహేష్ బాబుకి బ్లాక్‌బస్టర్ హిట్టు ఇచ్చిన చరిత్ర వుండటంతో సూపర్ స్టార్ అభిమానుల్లో ఈ సినిమాపై సైతం భారీ అంచనాలున్నాయి.
ఇక టీజర్ విషయానికి వస్తే.. మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో నటించిన తీరు అద్భుతంగా వుంటుందనిపించేలా ఈ టీజర్‌ని ఎడిట్ చేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే మీరు కూడా మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో ఎలా వున్నాడో ఓ లుక్కేసేయండి.