Mahesh Babu`s daughter Sithara: సితారకు కరోనా పరీక్షలు.. వీడియో వైరల్
మహేష్ బాబు కూతురు సితార కరోనావైరస్ పరీక్షలు చేయించుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓవైపు మెగాస్టార్ కుటుంబంలో గతంలో నాగబాబు, తాజాగా మెగాపవర్ స్టార్ రాంచరణ్, వరుణ్ తేజ్‌లకు కరోనా సోకిందనే వార్తలు అభిమానులను ఆందోళనకు గురిచేయగా.. తాజాగా మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్‌ల గారాలపట్టి సితార కూడా కోవిడ్-19 పరీక్షలు చేయించుకోవడం సూపర్ స్టార్ అభిమానులను కలవరపాటుకు గురిచేసింది.
మహేష్ బాబు కూతురు సితార కరోనావైరస్ పరీక్షలు చేయించుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓవైపు మెగాస్టార్ కుటుంబంలో గతంలో నాగబాబు, తాజాగా మెగాపవర్ స్టార్ రాంచరణ్, వరుణ్ తేజ్‌లకు కరోనా సోకిందనే వార్తలు అభిమానులను ఆందోళనకు గురిచేయగా.. తాజాగా మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్‌ల గారాలపట్టి సితార కూడా కోవిడ్-19 పరీక్షలు చేయించుకోవడం సూపర్ స్టార్ అభిమానులను కలవరపాటుకు గురిచేసింది. సితార కరోనా పరీక్షలు చేయించుకుంటోందంటే... సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబంలో కూడా కరోనావైరస్ అడుగుపెట్టిందా ఏంటని సూపర్ స్టార్ అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
మహేష్ బాబు తరహాలోనే ఆయన కూతురు సితారకు కూడా సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మరోవైపు సితార సైతం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వీడియో పోస్టులు పెట్టి హల్చల్ చేయడం, ఆ వీడియోలు వైరల్‌గా మారడం తెలిసిందే. అలాగే తాజాగా తాను కరోనా పరీక్షలు చేయించుకున్న వీడియోను కూడా సితార ( Mahesh Babu's daughter Sithara ) ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
కరోనా పరీక్షలు చేయించుకోవడానికి ముందు తాను ఎంతో సంశయించానని, కానీ మా అమ్మ నా చేయి పట్టుకుని పక్కనే నిలబడిందని.. అలాగే తాను అనుకున్నట్టుగా కరోనా పరీక్షలు అంత భయంకరమైనవో లేదా కష్టమైనవో కాదని సితార తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో పేర్కొంది. తరచుగా బయటికి వెళ్లి మిత్రులు, బంధువులను కలిసే వాళ్లు ముందు జాగ్రత్త చర్యగా కరోనా పరీక్షలు ( COVID-19 test ) చేయించుకుని ఆరోగ్యంగా ఉండండి అని సితార పేర్కొనడం అందరినీ ఔరా అనిపించింది. ఇంత చిన్న వయస్సులో ఎంత పెద్ద ఆలోచన చేసిందో కదా అని నెటిజెన్స్ మెచ్చుకుంటున్నారు.