Update on Guntur Kaaram : `గుంటూరు కారం`తో ఘాటెక్కిస్తున్న మహేష్ బాబు.. ఓ లుక్కేయండి!
Guntur Kaaram Inflammable Mass Strike: సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా నుంచి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు టైటిల్ సహా ఒక మాస్ స్ట్రైక్ అని చెబుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు.
Guntur Kaaram - Highly Inflammable Mass Strike: సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా రూపొందుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన అతడు, ఖలేజా వంటి సినిమాలు మంచి టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో వీరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమా అనౌన్స్ చేసి, మొదలుపెట్టి చాలా కాలం అవుతున్నప్పటికీ ఈ సినిమా టైటిల్ ఏంటో ప్రకటించలేదు. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు టైటిల్ సహా ఒక మాస్ స్ట్రైక్ అని చెబుతూ ఒక వీడియో రిలీజ్ చేస్తామంటూ సినిమా యూనిట్ ప్రకటించిన నేపథ్యంలో ఈ వీడియో ఎప్పుడు ఎప్పుడు వస్తుందో అనే అభిమానులు అందరూ చూస్తున్నారు.
నిజానికి గతంలో విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ సినిమా మీద భారీ అంచనాలను రేకెత్తించిన నేపథ్యంలో ఫస్ట్ గ్లింప్స్ ఎలా ఉండబోతుందని అందరూ ఎదురు చూస్తున్న సమయంలో ఎస్ఎస్ఎంబీ 28 మూవీ టైటిల్ తో పాటు గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. మాస్ స్ట్రైక్ పేరుతో రిలీజ్ చేసిన వీడియో అయితే హాట్ హాట్ గా సాగింది. ఈ సినిమాకు గుంటూరు కారం అనే టైటిల్ ఫిక్స్ చేయడంతో పాటు మహేష్ లుక్స్ కూడా సినిమా మీద అంచనాలు పెరిగే విధంగా ఉన్నాయి.
Also Read: Akhil Akkineni Movies : అఖిల్‌తో యూవీ క్రియేషన్స్ సాహసం.. ఇద్దరికీ జీవన్మరణ సమస్యే
దాదాపు 12 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతోంది అని అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా పూజా హెగ్డే, శ్రీ లీల ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద చిన్న బాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఈ సినిమా మీద కూడా అందరికీ అంచనాలు పెరిగిపోతున్నాయి. మరి ఇంకేంటి ఆలస్యం మీరు కూడా ఆ వీడియో చూసేయండి.
Also Read: Mahi v Raghava Shiatan : కొత్త కాన్సెప్ట్‌తో మహీ వి రాఘవ.. అంతకు మించి అనేలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook