Akhil Akkineni Movies : అఖిల్‌తో యూవీ క్రియేషన్స్‌ సాహసం.. ఇద్దరికీ జీవన్మరణ సమస్యే

Akhil Akkineni UV Creation Movie అఖిల్ అక్కినేని తాజాగా ఏజెంట్ సినిమాతో బోల్తా కొట్టేశాడు. ఇప్పుడు కొత్త సినిమాను మొదలుపెట్టే పనిలో పడ్డాడు. యూవీ క్రియేషన్స్‌తో అఖిల్ ఓ సినిమా చేయబోతోన్నాడని టాక్. ఈ సినిమాకు భారీ బడ్జెట్‌ను కేటాయించినట్టు తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 30, 2023, 05:30 PM IST
  • నెట్టింట్లో అఖిల్ సందడి
  • అఖిల్ కొత్త సినిమా అప్డేట్
  • యూవీ క్రియేషన్స్‌తో అఖిల్
Akhil Akkineni Movies : అఖిల్‌తో యూవీ క్రియేషన్స్‌ సాహసం.. ఇద్దరికీ జీవన్మరణ సమస్యే

Akhil Akkineni Dheera అక్కినేని హీరోలలో ఇప్పటివరకు సరైన బ్లాక్ బస్టర్ అందుకొని హీరో ఎవరైనా ఉన్నారంటే అది అఖిల్ మాత్రమే. నాగార్జున తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య తనకి చాలా హిట్లు కొట్టాడు. కానీ అఖిల్ మాత్రం ఇప్పటివరకు సరైన హిట్ కొట్టలేకపోయాడు. ముందుగా లాంచ్ అయిన అఖిల్ సినిమాతో పాటు తర్వాత మిస్టర్ మజ్ను హలో వంటి సినిమాలు తీవ్రస్థాయిలో నిరాశపరచగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మాత్రం కొంత ఊరట ఇచ్చింది.

అక్కినేని అఖిల్ కెరియర్ లో అత్యధిక భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కిన ఏజెంట్ మాత్రం థియేటర్లలో పెట్టిన పది శాతాన్ని కూడా వెనక్కి తీసుకురాలేకపోయింది. అఖిల్ అక్కినేని తో భారీ బడ్జెట్ సినిమాలు తీసి చేతులు కాల్చుకునే బదులు కాన్సెప్ట్ బేస్డ్ మీడియం బడ్జెట్ సినిమాలు చేసుకోవడం బెటర్ అనే వాదన వినిపిస్తోంది. అయితే అఖిల్ ఫేసు వాల్యూనో లేక ఆయన మీద ప్రయోగాలు చేద్దామనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ అఖిల విషయంలో నిర్మాతలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

ఇప్పటికే అఖిల్ తదుపరి సినిమాని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించడానికి ముందుకు వచ్చినట్లుగా కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఇది కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కి సినిమా అని కూడా ప్రచారం మొదలైంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాని ఏజెంట్ కంటే ఎక్కువ బడ్జెట్ హెచ్చించి తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది. ఏజెంట్ విషయానికి వస్తే సురేందర్ రెడ్డి కాబట్టి గట్టిగానే బడ్జెట్ పెట్టారు కానీ ఇప్పుడు అఖిల్తో యూవి క్రియేషన్స్ చేయబోతున్న ధీర అనే సినిమాకి కొత్త దర్శకుడు తీసుకుంటున్నారు.

Also Read: Keerthy Suresh Marriage: కీర్తి సురేష్ పెళ్లిపై తండ్రి క్లారిటీ..అసలు విషయం చెప్పేశాడుగా!

అయినా సరే బడ్జెట్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని అంటున్నారు. అఖిల్ రేంజ్ కు మించి ఖర్చు పెట్టడానికి సిద్ధమయ్యారు అనే ప్రచారం జరుగుతోంది. ఇక ఈ స్టోరీ అద్భుతంగా ఉందని అఖిల్ కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయమని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ పేరు ముందు వినిపించింది. కానీ ఆమె బదులు మరో బాలీవుడ్ భామను రంగంలోకి దింపడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి మరి అఖిల్ మీద ఇంత ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్న యూరి క్రియేషన్స్ సంస్థకు ఫలితం ఎలా రాబోతున్నాయి అనేది చూడాలి.

Also Read: Adipurush Rights: చివరి నిముషంలో ప్రభాస్ ప్రాజెక్టుల నుంచి యూవీ క్రియేషన్స్ ఔట్.. అసలు విషయం ఏంటంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News