Mahesh Fans in Tension Due to Trivikram: మహేష్ బాబు అభిమానులకు ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుంది, అదేంటంటే ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వం 28వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సర్కారు వారి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మహేష్ బాబు ఎవరితో సినిమా చేస్తాడు అని అందరూ ఎదురుచూస్తున్న సమయంలో త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమాకి సంబంధించిన ఒక షెడ్యూల్ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది, తర్వాత మహేష్ బాబు తల్లి తండ్రి మరణించడంతో కొంత గ్యాప్ తీసుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పుడు హైదరాబాదులో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మహేష్ బాబు కొన్ని సీన్స్ లో నటించారు, అయితే ప్రస్తుతానికి ఆయన విదేశాలకు వెళ్లినా సినిమా షూటింగ్ మాత్రం జరుగుతోంది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే త్రివిక్రమ్ జోడు గుర్రాల స్వారీ చేస్తున్నారని ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో జరుగుతోంది. అదేమిటంటే అటు డైరెక్టర్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు 28వ సినిమాకి బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోపక్క పవన్ కళ్యాణ్ హీరోగా సాయి ధరమ్ తేజ్ కీలక పాత్రలో నటిస్తున్న వినోదయ సిత్తం అనే తమిళ రీమేక్ సినిమాకు స్క్రీన్ ప్లే డైలాగ్ రైటర్ గా కూడా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.


నిజానికి తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాను తెలుగులో ఆ సినిమాను డైరెక్ట్ చేసిన నటుడు సముద్రఖని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సాయి ధరం తేజ్ కలిసి నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద తెరకెక్కుతున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ అయితే పర్ఫెక్ట్ అని ఆయనకు స్క్రీన్ ప్లే సహా డైలాగుల బాధ్యత అప్పగించినట్లు తెలుస్తోంది.


అలాగే త్రివిక్రమ్ కు పవన్ కళ్యాణ్ కి మంచి ఉన్న సాన్నిహిత్యం ఉన్న నేపథ్యంలో త్రివిక్రమ్ ఈ సినిమా ఒప్పుకున్నాడని చెబుతున్నా మహేష్ బాబు అభిమానులు మాత్రం మా సినిమా మీద పూర్తి దృష్టి కేంద్రీకరించకుండా మరో సినిమా మీద దృష్టి పెడితే తమ సినిమాకి ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందని వారందరు టెన్షన్ పడుతున్నారు. అయితే మరి త్రివిక్రమ్ వీటిని ఎలా మేనేజ్ చేస్తాడు అనేది తెలియాల్సి ఉంది. 


Also Read: Balakrishna Fires: నిర్మాతలను కసురుకున్న బాలకృష్ణ.. అసలు ఏమైందంటే?


Also Read: Sukesh legal notice: బాలీవుడ్ నటికి సుకేష్ 100 కోట్ల పరువు నష్టం దావా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook