Mahi v Raghava Shiatan : కొత్త కాన్సెప్ట్‌తో మహీ వి రాఘవ.. అంతకు మించి అనేలా
Mahi v Raghava Shaitan Web Series మహి వి రాఘవ ప్రస్తుతం ఊపు మీదున్నాడు. మొన్నటికి మొన్న సేవ్ ది టైగర్స్ అంటూ అందరినీ నవ్వించాడు. ఓటీటీలో ఈ వెబ్ సిరీస్ పెద్ద హిట్టుగా నిలిచింది. అందర్నీ కడుపుబ్బా నవ్వించేశాడు దర్శకుడు తన కథతో.
Mahi v Raghava Shaitan Web Series పాఠశాల, యాత్ర వంటి సినిమాలతో టాలీవుడ్ లో డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న మహివీ రాఘవ ఇప్పుడు పలు ఆసక్తికరమైన వెబ్ సిరీస్ ల నిర్మాణం మీద దృష్టి పెట్టారు. ఈ మధ్యనే ఆయన సేవ్ ది టైగర్స్ పేరుతో ఒక వెబ్ సిరీస్ ఉండగా తేజా కాకుమాను అనే యాక్టర్ ఆ వెబ్ సిరీస్ తో డైరెక్టర్గా మారి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మహీవి రాఘవ్ మరో ఆసక్తికరమైన వెబ్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.
ఆయన తెరకెక్కిస్తున్న తదుపరి షో సైతాన్. ఇది ఒక అవుట్ అండ్ అవుట్ క్రైమ్ ఎంటర్టైనర్ గా చెబుతున్నారు. ఆయన చాలా డెప్త్ ఉన్న కంటెంట్ గా దీన్ని రూపొందించాలనే ప్రచారం జరుగుతోంది. ఆయన రచించి ఆయన దర్శకత్వంలోనే తెరకెక్కుతున్న ఈ సైతాన్ షోలో రిషి చెల్లి, దేవి అని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ షో ఒక పూర్తిస్థాయి సోషల్ పొలిటికల్ అంశాలతో ముడిపడి ఉంటుందని.. బాలి అనే వ్యక్తి ఫ్యామిలీ ఎలా కుదుపుకు గురైంది?.. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఏమిటి?.. అనే విషయం మీద ఈ షో రూపొందించినట్లుగా తెలుస్తోంది.
అసలా ఫ్యామిలీ అంతా క్రైమ్ ని ఎందుకు తమ మార్గంగా ఎంచుకున్నారు? అనేది ఈ కథలో కీలకంగా ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ వెబ్ సిరీస్ లో క్రైమ్ కంటెంట్ ఎక్స్టెండ్ లో ఉంటుందని ఇప్పటివరకు తెలుగు వెబ్ సిరీస్ లో చూపించని భయంకరమైన క్రైమ్ సన్నివేశాలను ఈ వెబ్ సిరీస్ లో చూపించారని తెలుస్తోంది. వెన్నులో వణుకు పుట్టించే విధంగా సీన్స్ ఉంటాయని వయలెన్స్ బోల్డ్ కంటెంట్ చాలా డిస్టర్బ్‌గా ఉంటాయని కూడా ముందే హెచ్చరిస్తున్నారు.
Also Read: Keerthy Suresh Marriage: కీర్తి సురేష్ పెళ్లిపై తండ్రి క్లారిటీ..అసలు విషయం చెప్పేశాడుగా!
అందుకే ఈ వెబ్ సిరీస్ ని తగిన జాగ్రత్తలతో చూడాలని కూడా హెచ్చరిస్తున్నారు. ఈ సిరీస్ జూన్ 15వ తేదీ నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది మరి ఇంకెందుకు క్రైమ్ కంటెంట్ కోసం ఎదురు చూసే వాళ్ళందరూ ఆ వెబ్ సిరీస్ తప్పక చూసేయండి మరి.
Also Read: Adipurush Rights: చివరి నిముషంలో ప్రభాస్ ప్రాజెక్టుల నుంచి యూవీ క్రియేషన్స్ ఔట్.. అసలు విషయం ఏంటంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK