కెరీర్ ఆరంభం నుంచి విభిన్న చిత్రాలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు యువ హీరో అడివి శేష్‌. హీరోగా చేసినవి తక్కువ సినిమాలే అయినా ఇమేజ్ మాత్రం బాగానే వచ్చింది. తాజాగా అడివి శేష్‌ హీరోగా నటించిన చిత్రం 'మేజర్‌'. 26\11 ముంబై దాడుల్లో వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణణ్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమానే మేజర్‌. జీఎమ్‌బీ ఎంటర్‌టైన్మెంట్, ఏ ప్లస్‌ ఏస్‌ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా నిర్మించిన ఈ సినిమా జూన్‌ 3న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ పాత్ర‌లో అడివి శేష్ జీవించాడు. త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కులను ఒక ట్రాన్స్‌లోకి తీసుకెళ్లాడు. తొలి షో నుంచి మేజర్‌ చిత్రానికి పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడంతో బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది. ఈ చిత్రం శేష్ కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబ‌ట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. శేష్ గ‌త చిత్రానికి వ‌చ్చిన మొద‌టి రోజు క‌లెక్ష‌న్ల కంటే.. మేజర్‌కు ఐదు రేట్లు అధికంగా వ‌చ్చాయి. రెండ‌వ రోజు కూడా మేజ‌ర్ చిత్రం అదే జోరు చూపించింది. 


తొలి రోజు రూ.7.12 కోట్ల షేర్‌, 13.10 కోట్ల గ్రాస్‌ వసూళ్లను సాధించిన మేజ‌ర్ సినిమా.. రెండు రోజుల్లో రూ.13.48 కోట్ల షేర్‌, రూ.24.5 కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. అడివి శేష్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ కలెక్షన్స్‌. ఈ సినిమాకి నార్త్‌లో కలెక్షన్స్‌ రెండో రోజు 50 శాతం పెరిగాయట. ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటకలోనూ ఈ చిత్రం వసూళ్లు రెండో రోజు భారీగా పెరిగిగాయి. అమెరికాలో త్వరలోనే 1 మిలియన్‌ క్లబ్‌కి చేరువగా ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా మేజ‌ర్ చిత్రానికి రూ.14.93 కోట్ల థియేట్రికల్‌ బిజినెస్‌ జరిగినట్లు సమాచారం.


శశి కిరణ్‌ తిక్క దర్శకత్వం వహించిన మేజ‌ర్ చిత్రంలో అడివి శేష్ సరసన సయీ మంజ్రేకర్‌ హీరోయిన్‌గా నటించారు. సందీప్ పాత్రలో శేష్.. ఇషా పాత్రలో సయీ అద్భుతంగా నటించారు. శోభిత ధూళిపాళ కీలక పాత్ర చేశారు. ప్రకాశ్‌ రాజ్‌, రేవతి, మురళి శర్మ ఇతర కీలక పాత్రలు పోషించారు. శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందించారు. 


Also Read: Samantha - Naga Chaitanya: నాగ చైతన్య కోసం.. స్టార్‌ హీరో సినిమా వదులుకున్న సమంత!  


Also Read: IIFA 2022 Awards: 'ఐఫా 2022' అవార్డుల విజేతలు వీరే.. !


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook