Mimicry Artist Kalabhavan Haneef No More: ప్రముఖ మలయాళ సినీ నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ కళాభవన్ హనీఫ్ (63) కన్నుమూశారు. ఆయన వయసు 63. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన.. కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం ఆయన తుదిశ్వాస విడిచారు. ఎర్నాకులంలోని మట్టంచెరికి చెందిన కళాభవన్ హనీఫ్ 150కు పైగా చిత్రాల్లో హాస్య నటుడిగా నటించారు. విద్యాభ్యాసం తర్వాత సేల్స్‌మెన్‌గా కెరీర్ ఆరంభించిన ఆయన.. నాటకరంగంలో యాక్టివ్‌గా ఉండేవారు. కళాభవన్ బృందంలో ప్రధాన మిమిక్రీ కళాకారుడిగా పనిచేశారు. నాటకరంగంతో ప్రారంభమైన ఆయన కళాప్రస్థానం.. కళాభవన్ వరకు చేరుకుంది. చాలా సూపర్ హిట్ సినిమాలతో పాటు అనేక షోలలో తన పర్ఫామెన్స్‌తో ప్రేక్షకులను నవ్వించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిమిక్రీ ద్వారా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు హనీఫ్. 'చెప్పు కిలుక్కన చంగతి' మూవీ ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు. పరాక్కుం తాలికా చిత్రంలో వరుడి పాత్రతో సహా అనేక ఇతర హాస్య పాత్రలతో మెప్పించారు. ఇప్పటికే 150కి పైగా సినిమాల్లో నటించారు. ఈ ఏడాది విడుదలైన జలధార పంప్ సెట్ ఆయన చివరి చిత్రం. రేపు మట్టంచెరిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయనకు భార్య వహీదా,ఇద్దరు పిల్లలు షరూఖ్ హనీఫ్, సితార హనీఫ్‌ ఉన్నారు. షరూక్ ఈ ఏడాది ప్రారంభంలో పెళ్లి చేసుకున్నారు. అతని వివాహానికి మాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.


కళాభవన్ హనీఫ్ అనూహ్య అకాల మరణం సినీ ప్రపంచం విషాదంలో మునిగిపోయింది. ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఆయన మరణానికి సంతాపం తెలుపుతూ.. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని భరోసా ఇస్తున్నారు. హనీఫ్ ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. 


Also Read: Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  


Also Read: 3 Liters Instant Water Geyser Price: క్రోమాలో దీపావళి ఆఫర్స్‌..Usha Instano 3 లీటర్స్‌ వాటర్ గిజర్‌ను రూ.3,550కే పొందండి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook