PV Gangadharan passes away at 80: సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. మాలీవుడ్ లో మరో విషాదం జరిగింది. ప్రముఖ మలయాళ ప్రొడ్యూసర్ పీవీ గంగాధరన్(80) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం 6:30 గంటలకు కేర‌ళ‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. నిర్మాత పీవీ మృతి పట్ల సినీ ప్రముఖులు, ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిర్మాత గంగాధరన్ మలయాళంలో గృహలక్ష్మి ప్రొడక్షన్స్ స్థాపించి 20కి పైగా చిత్రాల‌ను నిర్మించారు. ఆయన నిర్మించిన మెుదటి సినిమా సుజాత (1977) కాగా.. చివరి సినిమా జానకి జానే (2023). ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమాల్లో ఒరు వడక్కన్ వీరగాథ (1986), కనక్కినవు (1997), వీండుం చిల వీట్టుకార్యంగల్ (1999), శాంతం (2001), అచ్చువింటే అమ్మ (2005), నోట్‌బుక్ (2006) వంటి చిత్రాలు ముఖ్యమైనవి. 


గంగాధరన్ నిర్మించిన కనక్కినవు (1997) చిత్రం బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటెగ్రేషన్ విభాగంలో నర్గీస్ దత్ నేష‌న‌ల్ అవార్డును గెలుచుకుంది. ఆయన నిర్మించిన చిత్రాల్లో శాంతం (2001) సినిమా జాతీయ ఉత్తమ సినిమాగా ఎంపికైంది. ఇవే కాకుండా ఒరు వడక్కన్ వీరగాథ (1986), కనక్కినవు (1997), వీండుం చిల వీట్టుకార్యంగల్ (1999), అచ్చువింటే అమ్మ (2005), నోట్‌బుక్ (2006) సినిమాలు రాష్ట్ర స్థాయి అవార్డులను గెలుచుకున్నాయి. ఈయన కేరళ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు.


Also Read: Kannappa Movie: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’లో కన్నడ సూపర్ స్టార్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook