Singer Death: ప్రముఖ సింగర్ మృతి... స్టేజీపై పాడుతూనే కుప్పకూలిన గాయకుడు...
Singer Edava Basheer Death: ప్రముఖ మలయాళ గాయకుడు ఎడవా బషీర్ ఓ కార్యక్రమంలో స్టేజీపై పాడుతూనే కుప్ప కూలిపోయారు. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Singer Edava Basheer Death: దిగ్గజ మలయాళ సింగర్ ఎడవా బషీర్ (78) గుండెపోటుతో మృతి చెందారు. స్టేజీపై పాడుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించినప్పటికీ... అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేరళలోని అలప్పుజా జిల్లాలో బ్లూ డైమండ్స్ ఆర్కెస్ట్రా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
'మానా హో తుమ్ బేహాద్ హసీన్...' అనే కేజే ఏసుదాస్ పాపులర్ హిందీ పాటను ఆలపిస్తూ బషీర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయన చేతిలో మైక్ పక్కకు పడిపోయింది. వెంటనే అక్కడున్నవారు బషీర్‌ను ఆసుపత్రికి తరలించినప్పికీ లాభం లేకపోయింది. కేరళలో ఆర్కెస్ట్రా కల్చర్‌ను పాపులర్ చేసినవారిలో ఎడవా బషీర్ పేరును ప్రముఖంగా చెబుతారు.
తిరువనంతపురంలో జన్మించిన ఎడవా బషీర్ స్కూల్ వయసు నుంచే పాటలు పాడుతున్నారు. పలు సూపర్ హిట్ చిత్రాలకు ఆయన పాటలు పాడారు. ఎన్నో అంతర్జాతీయ వేదికలపై సైతం గీతాలాపన చేశారు. ప్లే బ్యాక్ సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు. బషీర్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
Also Read: ATTAK ON MALLAREDDY: రెడ్డి సింహ గర్జనలో ఏం జరిగింది? మంత్రి మల్లారెడ్డిపై దాడి చేసిందెవరు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook