Sidhu Moose Wala Murder: తన పాటలతో చిన్న వయసులోనే అత్యంత పాపులారిటీ సంపాదించుకున్న పంజాబీ సింగర్ సిద్ధూ మూసే వాలా (28) హత్య సంచలనం రేపుతోంది. సిద్ధూ ప్రయాణిస్తున్న వాహనంపై 8 మంది దుండగులు దాడి చేశారు. మూడు ఏకే-94 రైఫిళ్లతో 30 రౌండ్ల పాటు కాల్పులు జరిపారు. దుండగుల దాడిలో సిద్ధూ తల, ఛాతి, కుడి చేతి భాగంలో బుల్లెట్లు దిగాయి. ఈ దాడిలో సిద్ధూ అక్కడికక్కడే మృతి చెందాడు. పంజాబ్ డీజీపీ ఏకే భవ్రా ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.
సాధారణంగా సిద్ధూ మూసే వాలా బుల్లెట్ ప్రూఫ్ ఫార్చూనర్ కారులో ప్రయాణిస్తుంటాడని... కానీ ఆదివారం (మే 30) అతను నాన్ బుల్లెట్ ప్రూఫ్ థార్ వాహనంలో బయటకు వెళ్లాడని డీజీపీ తెలిపారు. మూసా గ్రామంలోని తన ఇంటి నుంచి సాయంత్రం 4.30 గం. సమయంలో థార్ జీపులో అతను బయటకు వెళ్లినట్లు చెప్పారు. ఆ సమయంలో సిద్ధూతో పాటు మరో ఇద్దరు కూడా వాహనంలో ఉన్నట్లు తెలిపారు. సిద్ధూ ప్రయాణిస్తున్న జీపును దుండగులు రెండు కార్లతో వెంబడించారని.. సాయంత్రం 5.30 గం. సమయంలో సిద్ధూ జీపును అడ్డుకుని కాల్పులు జరిపారని వెల్లడించారు.
కాల్పుల ఘటన అనంతరం సిద్ధూని మాన్సా సివిల్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని తెలిపారు. సిద్ధూకి ప్రభుత్వం నలుగురు భద్రతా సిబ్బందితో రక్షణ కల్పించిందని... వీరిలో ఇద్దరిని ఆ ముందు రోజే ఉపసంహరించుకుందని చెప్పారు. ఉన్న ఇద్దరు భద్రతా సిబ్బందిని కూడా సిద్దూ వెంట తీసుకెళ్లలేదని తెలిపారు.
శత్రువులే సిద్ధూని హత్య చేశారని... లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఈ హత్య తమ పనే అని ప్రకటించిందని డీజీపీ వెల్లడించారు. గతంలో సిద్ధూ మూసే వాలా వద్ద మేనేజర్‌గా పనిచేసిన షాగన్‌ప్రీత్ ఈ హత్య వెనుక కుట్రదారుగా అనుమానిస్తున్నట్లు తెలిపారు. షాగన్‌ప్రీత్ ఆస్ట్రేలియా పారిపోయినట్లు చెప్పారు.
కాగా, తన సాంగ్స్ ఆల్బమ్స్‌లో సిద్ధూ ఎక్కువగా గన్స్‌తో కనిపించేవాడు. సిద్ధూ చేసిన చివరి సాంగ్ 'ది లాస్ట్ రైడ్.' గన్స్ అంటే చాలా ఇష్టపడే సిద్ధూ చివరికి అదే గన్స్‌కి బలవడం... తన చివరి సాంగ్‌కి లాస్ట్ రైడ్ అని పేరు పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
Also Read: Horoscope Today May 30 2022: రాశి ఫలాలు.. ఆ 3 రాశుల వారికి నేడు శభవార్తలు అందుతాయి...
Also Read: ATTAK ON MALLAREDDY: రెడ్డి సింహ గర్జనలో ఏం జరిగింది? మంత్రి మల్లారెడ్డిపై దాడి చేసిందెవరు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook