Tovino Thomas injured: మలయాళ నటుడు టోవినో థామస్‌(Tovino Thomas) సినిమా షూటింగ్‌లో గాయపడ్డారు. . లాల్ జూనియర్ దర్శకత్వం వహిస్తున్న 'నడికర్‌ తిలకం'( Nadikar Thilakam) షూటింగ్ లో టోవినో కాలికి గాయమైంది. దీంతో మూవీ యూనిట్ వెంటనే ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పెరుంబవూరు సమీపంలోని మారంపల్లిలో జరుగుతుంది. గాయం తీవ్రంగా లేదని.. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు తెలిపారు. సినిమా షూటింగ్‌ని ప్రస్తుతం నిలిపేశాం..వారం తర్వాత మళ్లీ ప్రారంభిస్తామని దర్శకుడు లాల్ జూనియర్ తెలిపారు. ప్రస్తుతం ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టోవినో థామస్‌కు మాలీవుడ్ తోపాటు టాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ ఉంది. రెండేళ్ల కిందట వచ్చిన మిన్నల్‌ మురళీ సినిమాతో తెలుగులో పాపులారిటీ సంపాదించుకున్నాడు థామస్. రీసెంట్ గా వచ్చిన 2018 సినిమా కూడా తెలుగులో భారీ కలెక్షన్స్ ను సాధించింది. ప్రస్తుతం ఆయన నటించిన ఏఆర్‌ఎమ్‌ రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమాను తెలుగులోనూ విడుదల చేసేందుకు మేకర్స్ భారీ ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు.  డ్రైవింగ్‌ లైసెన్స్‌ వంటి బంపర్ హిట్ తర్వాత లాల్‌ నుంచి వస్తున్న సినిమా కావడంతో మూవీపై భారీగానే అంచనాలు ఉన్నాయి. షోబిన్‌ షాహీర్, షైన్‌ టామ్ చాకోలు కీ రోల్స్ చేస్తున్నారు. ఈ మూవీని వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. 


Also read: Jailer Success: జైలర్ సక్సెస్ కంటిన్యూ.. అనిరుధ్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన కళానిధి మారన్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook