Music Director Mark K Robin : మ్యూజిక్‌తో `మార్క్` వేసిన సంగీత దర్శకుడు
Music Director Mark K Robin మార్క్ కే రాబిన్ తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా ప్రేక్షకుల్లో తన మార్క్ వేశాడు. మల్లేశం, జాంబీ రెడ్డి, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి సినిమాలకు మార్క్ కే రాబిన్ పని చేసిన సంగతి తెలిసిందే.
Music Director Mark K Robin మార్క్ కే రాబిన్ తన సంగీతం, ఆర్ఆర్‌తో చిన్న సినిమాల లెవెల్‌ను పెంచేశాడు. మల్లేశం, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాంబి రెడ్డి వంటి సినిమాల్లోని పాటలు, ఆర్ఆర్ నెక్ట్స్ లెవెల్లో ఉంటాయి. అయితే అలా మార్క్ కే రాబిన్ తన మార్క్ సంగీతాన్ని తెలుగు ప్రేక్షకులపై వేశాడు. ఇప్పుడు బాలీవుడ్‌ను కూడా తన వైపు తిప్పుకున్నాడు.
షార్ట్ ఫిలిమ్స్‌కి సంగీతం అందిస్తూ మెల్లమెల్లగా ఇండస్ట్రీలోకి వచ్చిన మార్క్ కే రాబిన్ ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతున్నాడు. 2017లో మ్యూజిక్ డైరెక్టర్ గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన మార్క్.. మళ్ళీ కలుద్దాం అనే షార్ట్ ఫిల్మ్‌తో SIIMA అవార్డు గెలుచుకున్నాడు. డిలీ బిలీ అనే షార్ట్ ఫిల్మ్‌కి ఉత్తమ సంగీత దర్శకుడిగా నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డు అందుకున్నారు.
మల్లేశం, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాంబి రెడ్డి సినిమాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి. విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన లైగర్ మూవీలో చార్ట్‌బస్టర్ నంబర్ వాట్ లగా దేంగే పాటని మార్క్ కంపోజ్ చేసిన సంగతి తెలిసిందే. నాగార్జున ఘోస్ట్ సినిమాకు ఆర్ఆర్ అందించిన సంగతి తెలిసిందే.
Also Read: Keerthy Suresh Marriage: కీర్తి సురేష్ పెళ్లిపై తండ్రి క్లారిటీ..అసలు విషయం చెప్పేశాడుగా!
మార్క్ రీసెంట్‌గా.. బాలీవుడ్ ప్రాజెక్ట్ 8 AM మెట్రోకి పని చేశాడు. ఇందులో ప్రముఖ నూరన్ సిస్టర్స్ వో ఖుదా (ఈద్ ముబారక్ వెర్షన్)ని పాడగా.. అది సెన్సేషన్ అయింది. జుబిన్ నాటియాల్ పాడిన - ఘూమీ పాట కూడా ట్రెండింగ్‌లోకి వచ్చింది. బాలీవుడ్‌లో ఇప్పుడు మనోడి సంగీతానికి డిమాండ్ చేకూరింది. మొత్తానికి నార్త్‌లో మన మార్క్ కే రాబిన్ మ్యూజిక్ బాగానే వైరల్ అవుతోంది.
Also Read: Adipurush Rights: చివరి నిముషంలో ప్రభాస్ ప్రాజెక్టుల నుంచి యూవీ క్రియేషన్స్ ఔట్.. అసలు విషయం ఏంటంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK