అభిమాని కోరిక తీర్చిన `రియల్ హీరో`
ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి వీరాభిమాని ఒకతను వయనాడ్ ప్రాంతంలో తన అభిమాన హీరో షూటింగ్‌లో పాల్గొంటున్నారని తెలిసి కలవడానికి వచ్చాడు. తన అభిమాన హీరో కోసం చాలాసేపటి వరకు ఎదురుచూస్తూ.. రోడ్డు పక్కనే నిలబడ్డాడు. ఈ విషయాన్ని ఎవరిద్వారానో తెలుసుకున్న హీరో తానే స్వయంగా కారులో వెళ్ళి తన అభిమానిని కలిసి వచ్చారు. ఆ ఘటన ఆ షూటింగ్ స్పాట్‌లో ఉన్నవారినందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ అభిమాని కూడా హీరో తన కోసం అంత దూరం రావడంతో ఆశ్చర్యచకితుడయ్యాడు. మమ్ముట్టి తన అభిమానితో సెల్ఫీలు కూడా దిగారు.