Attack On Vijay Sethupathi: బెంగళూరు ఎయిర్ పోర్టులో నటుడు విజయ్ సేతుపతిపై దాడి.. కారణమిదే!
Attack On Vijay Sethupathi: తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతిపై బెంగళూరు ఎయిర్ పోర్టులో దాడి జరిగింది. గుర్తు తెలియని ఓ వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి విజయ్ సేతుపతిని వెనుక నుంచి ఎగిరి తన్నే దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమిళనాడు, కర్ణాటక మధ్య వివాదాల నేపథ్యంలో దీనిపై పుకార్లు వ్యాపించాయి. కానీ అసలు విషయం ఏంటనే దానిపై అసలు విషయం బయటకు రాలేదు.
Attack On Vijay Sethupathi: తమిళ నటుడు విజయ్ సేతుపతిని బెంగుళూరు ఎయిర్ పోర్ట్‌లో ఓ వ్యక్తి ఎగిరి తన్నడం సంచలనంగా మారింది. అందరితో కలివిడిగా వుండే ఈ స్టార్‌కి ఇలాంటి చేదు అనుభవం ఎదురు కావడం ఏంటని అందర్నీ ఫీల్ అయ్యేలా కూడా చేసింది. అయితే సేతుపతిని ఓ ఆగంతకుడు కాలితో తన్నడం వెనుక ఓ పవర్ ఫుల్ కారణమే ఉందంటున్నారు కొంత మంది విశ్లేషకులు. పవర్ స్టార్ పునీత్ అంత్యక్రియలను ఈ ఘటనతో ముడేసి మరీ చెబుతున్నారు. కర్ణాటక, తమిళనాడు.. రెండు రాష్ట్రాల దాహార్తిని తీర్చడమే కాదు.. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య ఆరని చిచ్చుకు కావేరీ నది కారణం అయింది. ఆ నదీ జలాల పంపకం కారణంగానే కన్నడిగులు, తమిళులు బద్దశత్రువులుగా మారాల్సి వచ్చింది. ప్రజలు మాత్రమే కాదు.. వారి వెంటే ఫిల్మ్ సెలబ్రిటీలు కూడా విడిపోయి సినిమాలను బ్యాన్ చేసుకునే స్థాయి వరకు తీసుకెళ్లింది.
ఇక ఈ వివాదం కారణంగానే కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలకు తమిళ హీరోలు ఎవరూ వెళ్లలేదు. తమిళ హీరోలు అలా వెళ్లక పోవడం పై అంతటా విమర్శలు కూడా వచ్చాయి. రాజ్‌కుమార్ హార్డ్ కోర్ అభిమానులైతే సోషల్ మీడియా వేదికగా ఈ విషయంపై తమిళ హీరోలను ఓ రేంజ్లో ఏకిపారేశారు. ఇక ఆ క్రమంలోనే హీరో విజయ్ సేతుపతి తాజాగా బెంగుళూరు ఎయిర్ పోర్ట్లో కనిపించడం వల్ల.. ఓ కన్నడికుడు ఆవేశంతో ఇలా చేసి ఉంటాడని విశ్లేషకులు అంటున్నారు. అంతేకాని కావాలని సేతుపతి మీద దాడి చేసి ఉండకపోవచ్చని వారంటున్నారు. కాని ఏది ఏమైనా.. ఇలాంటి ఘటన శోచనీయమని వారంటున్నారు.
విజయ్‌పై దాడి చేసిన వ్యక్తి పేరు జాన్సన్ అని, బెంగళూరులో నివాసముండే ఇతడు మలయాళీ వాసి అని తెలుస్తోంది. అతడు నటుడితో సెల్ఫీ కోసం ప్రయత్నించగా ఆయన అసిస్టెంట్లు అతడిని అడ్డుకున్నారు. ఇది మనసులో పెట్టుకుని రగిలిపోయాడా వ్యక్తి. అప్పటికే తాగిన మైకంలో ఉన్న అతడు సెల్ఫీకి నిరాకరించారన్న ఆవేశంతో విజయ్‌ను తన్నాడు. ఈ చర్యతో అప్రమత్తమైన నటుడి సహాయక సిబ్బంది వెంటనే ఆగంతకుడిని పట్టుకున్నారు. అయితే విజయ్ మాత్రం అతడిని ఏమీ అనకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సదరు వ్యక్తి విజయ్ సేతుపతికి క్షమాపణలు చెప్పినట్లు సమాచారం!
Also Read: Mike Tysons poster from Liger : దీపావళి స్పెషల్ గా “లైగర్” నుంచి మైక్ టైసన్ లుక్ రిలీజ్
Also Read: F3 Movie: సంక్రాంతి బరిలో నుండి తప్పుకున్న ఎఫ్3.. దీపావళి స్పెషల్ వీడియో రిలీజ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe