F3 Movie: సంక్రాంతి బరిలో నుండి తప్పుకున్న ఎఫ్3.. దీపావళి స్పెషల్ వీడియో రిలీజ్

కామెడీ ఫామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న 'ఎఫ్3' సినిమా సంక్రాతి బరిలో నుండి తప్పుకుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 న విడుదల చేస్తున్నట్లు దీపావళికి స్పెషల్ వీడియోలో తెలిపిన ఎఫ్3 టీమ్   

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 4, 2021, 01:40 PM IST
  • సంక్రాంతి బరి నుండి తప్పుకున్న 'ఎఫ్3'
  • దీపావళి స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన 'ఎఫ్3' టీమ్
  • వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 ప్రేక్షకుల ముందుకు రానున్న 'ఎఫ్3'
F3 Movie: సంక్రాంతి బరిలో నుండి తప్పుకున్న ఎఫ్3.. దీపావళి స్పెషల్ వీడియో రిలీజ్

Diwali Special Wishes Video form F3: అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహించిన 'ఎఫ్2' (F2) సినిమా 2019 సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే! ఎఫ్2 కు సీక్వెల్ గా 'ఎఫ్3' (F3) సినిమా కూడా  అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆద్యాంతం కామెడీ, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరో విక్టరీ వెంకటేష్ (Venkatesh), మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej) హీరోలుగా , మిల్కీ బ్యూటీ తమన్నా (Tamanna Bhatia), మెహ్రీన్  (Mehreen Kaur Pirzada) కథానాయికలుగా  నటిస్తున్నారు, 

అయితే 'ఎఫ్3; సినిమాలో సునీల్(Sunil), సోనాల్ చౌహాన్ కూడా కీలక పాత్రలలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదల అవ్వాల్సిన ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదల (F3 Release Date) అవ్వనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. నిర్మాత దిల్ రాజు (Dil Raju) సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

Also Read: T20 World Cup 2021: భారత్ సెమీస్ చేరాలంటే.. ఈ అద్భుతాలు జరగాల్సిందే!

'ఎఫ్3' సినిమా చివరి చిత్రీకరణ దశలో ఉండగా.. దీపావళి (Deepavali)కానుకగా శుభాకాంక్షురాలు తెలుపుతూ చిత్ర యూనిట్ ఒక వీడియోని విడుదల చేసింది. ఈ వీడియోలో హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ (Cable Bridge) పైన నిలబడి హీరో వెంకటేష్, వరుణ్ తేజ్, సునీల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో పాటు నటుడు రఘు బాబు (Raghu Babu) కూడా ఉన్నారు. "గెట్ రెడీ ఆన్ ఫన్ బ్లాస్ట్ ఫిబ్రవరి 25th.. హ్యాపీ దీవాలి" అంటూ చెప్పిన విషెస్ వీడియో ఆకట్టుకుంటుంది. ఆ వీడియో మీరు కూడా చూడండి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News