Manamey Closing Box collection: తెలుగు సినీ పరిశ్రమలో టాలెంటెడ్ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు శర్వానంద్. ఈ మధ్యకాలంలో మనోడికి హిట్ కోసం ముఖం వాచిపోయాడు. అపుడెపుడో 2017లో మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహానుభావుడు’ సినిమా తర్వాత శర్వానంద్ నకు హిట్ అనేదే లేదు. రొటిన్ కు భిన్నంగా సినిమాలు చేస్తున్న సక్సెస్ మాత్రం రావడం లేదు. రీసెంట్ గా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకుంది. తన స్నేహితుడి అతడి భార్య చనిపోవడంతో అతని కుమారుడి బాధ్యతను హీరోయిన్ తో కలిసి  స్వీకరిస్తాడు శర్వానంద్. ఈ నేపథ్యంలో జరిగిన  సంఘటనల సమాహారమే ‘మనమే’ సినిమా.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమా 7 జూన్ విడుదలై ఓ మోస్తరుగా నడిచింది. ఈ సినిమా తెలుగులో రూ. 9.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్  చేసింది. మొత్తంగా రూ. 10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 11.03 కోట్ల షేర్ రాబట్టి హిట్ స్టేటస్ అందుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉండటం ఈ సినిమాకు కలిసొచ్చింది. అప్పట్లో ఈ సినిమాకు పెద్దగా పోటీ ఏమి లేకపోవడంతో ఈ సినిమా మొత్తం బిజినెస్ పై రూ. 1.03 కోట్ల లాభాన్ని అందుకుంది.


ప్రస్తుతం శర్వానంద్ తెలుగులో ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. హీరోగా 35వ చిత్రం. ప్రస్తుతం శర్వానంద్ చేతిలో రెండో సినిమాలున్నాయి. ఇవి కూడా ఢిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రాలు కావడం విశేషం. మొత్తంగా  క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినీ రంగ ప్రవేశం చేసిన శర్వానంద్ ఆ తర్వాత పలు శంకర్ దాదా ఎంబీబీఎస్, సంక్రాంతి, లక్ష్మీ వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు. హీరోగా యువసేనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్.. వెన్నెల సినిమాలో విలన్ గా మెప్పించాడు. ఆ తర్వాత ‘ప్రస్థానం’ సినిమాతో హీరోగా బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత కథానాయకుడిగా శర్వానంద్ వెనుదిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం కెరీర్ పరంగా డల్ గా ఉన్న శర్వానంద్ కు రాబోయే చిత్రాల విజయం కీలకం అని చెప్పాలి.


ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..


ఇదీ చదవండి:  చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి