Manchi Rojulochaie Movie updates Prabhas And Allu Arjun wishes to Manchi Rojulochaie Movie team: మారుతి దర్శకత్వంలో సంతోష్‌ శోభన్, మెహరీన్‌ జంటగా నటించిన మూవీ మంచి రోజులు (Manchi Rojulochaie) వచ్చాయి. యూవీ కాన్సెప్ట్స్, మాస్‌ మూవీ మేకర్స్, వి సెల్యూలాయిడ్, ఎస్‌కేఎన్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 4న రిలీజ్ కానుంది. ఈ మధ్యే విడుదలైన మంచి రోజులు వచ్చాయి మూవీ రిలీజ్ ట్రైలర్ కు (Movie Release Trailer) మంచి ఆదరణ లభించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


‘మంచి రోజులు వచ్చాయి’ ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తుందంటూ ఈ మూవీ నిర్మాతలు తెలిపారు. ఇక ప్రభాస్, (Prabhas) అల్లు అర్జున్ (Allu Arjun) ‘మంచి రోజులు వచ్చాయి’ టీమ్‌కి విషెస్ తెలిపారు. మంచి రోజులు వచ్చాయి సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నామని చెప్పారు. 



ఇక దర్శకుడు మారుతి, నిర్మాతలు, నటీనటులు, సినిమా కచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాజాగా ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్స్ (Special premieres) కు మంచి స్పందన వచ్చినట్లు మూవీ యూనిట్‌ పేర్కొంది. అన్నిచోట్ల హౌజ్ ఫుల్ బోర్డులు (House full boards) కనిపిస్తున్నాయని తెలిపింది. 



 


Also Read : Bus Fall into Ravine: ఘోర ప్రమాదం.. లోయలో పడిపోయిన బస్సు... 22 మంది మృతి


తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో నవంబర్ 3 రాత్రి పెయిడ్ ప్రీమియర్స్ (Paid premieres) ఏర్పాటు చేశారు. ఈ స్పెషల్ ప్రీమియర్ బుకింగ్ ఓపెన్ అయిన వెంటనే టికెట్స్ అన్నీ అమ్ముడుపోయాయని మంచి రోజులు (Manchi Rojulochaie) మూవీ యూనిట్ తెలిపింది. మొత్తం 15 చోట్ల ఈ ప్రీమియర్స్ (Premieres) ఏర్పాటు చేస్తున్నారు. అన్నింటికి హౌజ్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.


Also Read : Akhanda title song teaser: అఖండ టైటిల్ సాంగ్ టీజర్ వచ్చేస్తోంది


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook