Manchi Rojulochaie Trailer: ‘మంచి రోజులోచ్చాయి’ మూవీ ట్రైలర్‌ రిలీజ్‌

Manchi Rojulochaie Movie Trailer Release: ‘మంచి రోజులు వచ్చాయి’.మూవీ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. సో మై డియర్‌‌ వాట్సాప్ అంకుల్స్ అండ్ యూట్యూబ్ ఆంటీస్‌.. నా పేరు సంతోష్, ఆనందానికి కేరాఫ్ అడ్రస్‌ వీడు అనేది నా ట్యాగ్‌లైన్ అంటూ సంతోష్ శోభ‌న్ త‌నను తాను ప‌రిచ‌యం చేసుకునే సీన్‌తో మొదలయ్యే ఈ ట్రైల‌ర్ ఆకట్టుకుంటోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 14, 2021, 03:51 PM IST
  • మారుతి దర్శకత్వంలో సంతోష్‌ శోభన్‌, మెహరీన్‌ జంటగా తెరకెక్కుతోన్నమూవీ "మంచి రోజులు వచ్చాయి"
  • వచ్చే నెల 4న రిలీజ్‌
  • మూవీ ట్రైలర్‌ విడుదల
Manchi Rojulochaie Trailer: ‘మంచి రోజులోచ్చాయి’ మూవీ ట్రైలర్‌ రిలీజ్‌

Santosh Shoban Mehreen Pirzadas Manchi Rojulochaie Movie Trailer out: మారుతి (Maruthi) దర్శకత్వంలో సంతోష్‌ శోభన్‌, మెహరీన్‌ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. కామెడీ జానర్‌‌లో రూపొందుతోన్న ఈ మూవీకి సంబంధించిన ఇప్పటికే ఫస్ట్‌లుక్‌, టీజర్‌లు రిలీజై.. ప్రేక్షకుల ఆదరణ పొందాయి. 

ప్రస్తుతం మంచి రోజులు వచ్చాయి మూవీకి సంబంధించి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు సాగుతున్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే నెల 4న రిలీజ్‌ చేయాలని మూవీ యూనిట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను (Movie Trailer) రిలీజ్‌ చేశారు. 

Also Read : Manchu Vishnu: బాలకృష్ణ ఆశీర్వాదం తీసుకున్నా..మెగాస్టార్‌‌ని కలుస్తా- మంచు విష్ణు

సో మై డియర్‌‌ వాట్సాప్ అంకుల్స్ అండ్ యూట్యూబ్ ఆంటీస్‌.. నా పేరు సంతోష్, ఆనందానికి కేరాఫ్ అడ్రస్‌ వీడు అనేది నా ట్యాగ్‌లైన్ అంటూ సంతోష్ శోభ‌న్ (Santosh Shoban) త‌నను తాను ప‌రిచ‌యం చేసుకునే సీన్‌తో మొదలయ్యే ఈ ట్రైల‌ర్ (Trailer) ఆకట్టుకుంటోంది. ఇక ‘నా కూతురు లాంటి కూతురిని క‌న్న ఎవ‌రైనా స‌రే ఆరోగ్యంగా ఉండాల్సిందే.. అంటూ అజయ్ ఘోష్ ( Ajay Ghosh) మెహ్రీన్‌ (Mehreen) గురించి చెప్పే డైలాగ్స్ ఆక‌ట్టుకుంటున్నాయి.

 

కాగా ఎస్‌కేఎన్, వీ సెల్యూలాయిడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ (Anup Rubens) మ్యూజిక్‌ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మారుతి (Maruthi) తన మార్క్ కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్‌ను మేళవించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దసరా (dussehra) కానుకగా విడుదలైన మూవీ ట్రైలర్‌ (Movie Trailer) కూడా సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది. 

Also Read : 550 Birthday cakes video: ఒకేసారి 550 బర్త్‌డే కేకులు కట్ చేసిన యువకుడు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News