Manchu Lakshmi: కూతురుతో కలిసి మంచు లక్ష్మి అదిరిపోయే స్టెప్పులు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో ఇదే..
Manchu Lakshmi Dance video: మంచు లక్ష్మి తన కూతురుతో ఫుల్ డాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Manchu lakshmi dance with daughter video: మంచు వారసురాలు మంచు లక్ష్మి తరచుగా వార్తలలో ఉంటారు. ఆమె కంటూ ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా క్రియేట్ చేసుకున్నారు. అదే విధంగా మంచు లక్ష్మి.. కొన్నిసార్లు ఇంగ్లీష్ మాట్లాడుతూ జనాలకు చుక్కలు చూపిస్తున్నారు. కొంత మంది నెటిజన్ లు కూడా.. మంచు లక్ష్మి మాట్లాడిన మాటల్ని ట్రోలింగ్ సైతం చేసిన విషయం తెలిసిందే.
అంతే కాకుండా.. పలు సినిమా కార్యక్రమాలలో కూడా మంచు లక్ష్మి.. తమ కుటుంబం, మోహన్ బాబు... అంత గొప్ప నటుడు లేడని అంతేకాకుండా.. తన తండ్రిని పొగుడుతూ తరచుగా ట్రోలింగ్ లకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మంచులక్ష్మి... ముంబైలో ఉంటున్నట్లు తెలుస్తొంది. మరోవైపు మంచు లక్ష్మి.. టీచ్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలిగా ఉన్నట్లు తెలుస్తొంది.
ఆమె తెలుగు స్టేట్స్ లలో ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్నట్లు సమాచారం. ఈ పాఠశాలల్లో డిజిటల్ స్మార్ట్ తరగతుల్ని సైతం నిర్వహిస్తున్నారంట. మంచు లక్ష్మికి తన కూతురు విద్యా నిర్వాణ అంటే పంచ ప్రాణాలంట. తనతో ఎక్కువ సమయం గడిపేందుకు ఆసక్తి చూపిస్తుంటుంది. ఎంత బిజీగా ఉన్న కూడా కూతుర్ని కంటికి రెప్పలాగా చూసుకుంటుందంట. ఈ క్రమంలో .. తాజాగా ఈ తల్లీకూతుళ్లు.. ఒక ఇంగ్లిష్ పాటకు డ్యాన్స్ చేస్తూ హల్ చల్ చేశారు.
ఈ పాటలో.. తల్లి , కూతుళ్లు.. చేసిన డ్యాన్స్ ప్రస్తుతం వైరల్ గా మారింది. దీనిలో మంచు లక్ష్మి.. బుజ్జి స్కర్ట్ వేసుకుని డ్యాన్స్ చేస్తు రచ్చ చేశారు. కూతురుతో పాటు అదిరిపోయే విధంగా స్టెప్పులు వేశారు.
అయితే.. మంచు లక్ష్మి వేసుకున్న స్కర్ట్ పై ప్రస్తుతం వివాదం నెలకొంది. కూతురు అంత చిన్న బట్టలు వేసుకుని డ్యాన్స్ చేయడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. మరికొందరు కూతురు స్కర్ట్ ని .. నీ స్కర్ట్ అనుకుని వేసుకున్నావా.. అంటూ సెటైర్ లు వేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారింది.