Garikapati narasimharao fires on pushpa-2 team video: ప్రస్తుతం ఎక్కడ చూసిన పుష్పా-2 మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు వస్తుందా అని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా.. మన దేశంలోనే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా అల్లు అర్జున్ పుష్ప మెనియా నడుస్తొందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో ప్రస్తుతం పుష్ప సినిమా టీమ్ దేశమంతట పలు ఈవెంట్లు కొనసాగుతున్నాయి. డిసెంబరు 5న సినిమా అభిమానుల ముందుకు రానుందని చెప్పుకొవచ్చు.
Trending now! #Pushpa2 #GarikipatiNarasimhaRao pic.twitter.com/dQGWJqYjAu
— Manmohan Miryala (@MiryalaManmohan) November 21, 2024
ఈ నేపథ్యంలో ప్రస్తుతం పుష్పా2 మూవీ సినిమాలోని కొన్ని డైలాగులు ఇప్పటికే వివాదాస్పదంగా మారిందని చెప్పుకొవచ్చు. ముఖ్యంగా గతంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ సైతం.. పుష్పా2 గంధపు చెక్కల స్మగ్లింగ్ లపై సెటైరిక్ గా మాట్లాడారు. ఒకప్పుడు హీరోలు స్మగ్లింగ్ లాంటివి జరక్కుండా చూసేవారని.. కానీ ఇప్పుడు మాత్రం.. హీరోలే స్మగ్లింగ్ లాంటి పాత్రలు చేస్తున్నారని.. ఇన్ డైరెక్ట్ గా అల్లు అర్జున్ పై పవన్ వ్యాఖ్యలు చేశారని కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ప్రస్తుతం ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నర్సింహరావు పుష్పా-2 సినిమాపై మండిపడ్డారు.
ఈ మూవీలోని తగ్గెదెలా డైలాగ్ మీద ఆయన తనదై శైలీలో సెటైర్ లు వేశారు. స్మగ్లింగ్ వాళ్లను హీరోల్లా చేశారని.. అన్నారు. స్మగ్లింగ్ చేసేవాడు తగ్గెదెలా అంటాడా.. కుర్రాళ్లు ఇటీవల తగ్గెదెలా అంటున్నారు.. ఈ డైలాగుల వల్ల సమాజంలో నేరాలు పెరిగిపోయాయన్నారు. ఈ మూవీ డైరెక్టర్ ను, అల్లుఅర్జున్ ను కడిగేస్తానంటూ కూడా గరికపాటి నర్సింహరావు మండి పడ్డారు.
Read more: Nara lokesh: ఆ బుడ్డొడికి అండగా నేనుంటా.. రంగంలోకి దిగిన నారా లోకేష్.. వీడియో వైరల్..
సత్య హరిశ్చంద్రుడు.. శ్రీరాముడు లాంటి వారు మంచి పనులు చేస్తారు.. వారు అలాంటి వ్యాఖ్యలు చేసిన దానికి ఒక అందముంటుందన్నారు. తొక్కలో స్మగ్లర్ ఈ డైలాగ్ లు వాడటమేంటని కూడా గరికపాటి రెచ్చిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.