Manchu Manoj Behind Manchu Vishnu Marriage: నిన్నటి నుంచి మంచు మనోజ్-మంచు విష్ణు మధ్య ఏర్పడిన వివాదం గురించి అనేక వార్తలు తెరమీదకు వస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తవానికి ఈ ఇద్దరి అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు ఏర్పడ్డాయని మంచు మనోజ్ ఆస్తి పంపకాలు చేయమని కోరుతున్నాడని దానికి మంచు విష్ణు అడ్డుపడుతున్నాడని ఇలా ఒక్క ప్రచారం కాదు అనేక ప్రచారాలు తెరమీదకు వస్తూనే ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిన్న అనూహ్యంగా మంచు మనోజ్ తన ఫేస్బుక్ పేజీ వేదికగా మంచు విష్ణు తన మనిషి సారధి ఇంటికి వచ్చి చేస్తూ ఇలా బలవంతం చేస్తూ ఉంటాడని ఇది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుందని మంచు మనోజ్ ఆరోపించాడు. తర్వాత మంచు మోహన్ బాబు రంగంలోకి దిగడం ఫేస్బుక్ వీడియో డిలీట్ చేయించడంతో పాటు వాళ్ళిద్దరూ కుర్రవాళ్ళు ఏదో ఆవేశపడ్డారని తాను ఇలాంటి విషయాల్లో ఆవేశ పడవద్దు అని వారికి చెబుతూ ఉంటానని చెప్పుకొచ్చాడు.


అయితే మంచు మనోజ్, మంచు విష్ణు మధ్య ఇప్పుడు గొడవలు మొదలయ్యాయి ఏమో కానీ ఒకప్పుడు వీరిద్దరి మధ్య మంచి సన్నిహిత్య సంబంధాలు ఉండేవి. ఈ విషయాన్ని స్వయంగా మంచు విష్ణు గతంలో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఒక మీడియా సంస్థ అధినేత నిర్వహించిన ఇంటర్వ్యూలో మంచు విష్ణు మాట్లాడుతూ తన పెళ్లి విషయంలో తన తండ్రి ఒప్పుకోని సమయంలో మంచు మనోజ్ చాలా సహాయం చేశాడని అన్నారు. ఆ సమయంలో మంచు మనోజ్ చిన్నవాడు కానీ నాన్న దగ్గరికి వెళ్లి ఈ విషయాన్ని ఎలా చేరవేయాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడని అన్నారు.


ఒకానొక సందర్భంలో మంచు మనోజ్ మా అమ్మని తీసుకువెళ్లి నాన్న పక్కన పడుకుని ఆయన గుండెల మీద తలపెట్టి నాన్న వదినని ఇంటి కోడలుగా ఒప్పుకోవచ్చు కదా అని అడిగారని బహుశా మోహన్ బాబు అప్పటికే ఆలోచిస్తూ ఉండి ఉండవచ్చేమో తెలియదు కానీ వెంటనే సరే వారి ఇంటికి కబురు పంపించి మాట్లాడాలని చెప్పండి అని చెప్పారట. అలా నా పెళ్లి విషయంలో మంచు మనోజ్ చాలా సహాయం చేశాడని మంచు విష్ణు చెప్పుకొచ్చారు. అలాగే తన పెళ్లి రించి మొట్టమొదటిసారిగా తన తండ్రితో మాట్లాడింది బ్రహ్మానందం అని తర్వాత అందరూ ఒప్పించే ప్రయత్నం చేశారని మంచు విష్ణు చెప్పుకొచ్చారు. 
Also Read: Samantha Saree Photos: శారీలో సమంత క్లీవేజ్ షో.. అందాల విందు చూస్తే నిద్రపోలేరు!


Also Read: IPL 2023: అమ్ముడుపోకుండా ఉంటే బాగుండేది... భయపెట్టిన విరాట్ గురించి షాకింగ్ విషయం బయటకు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook