IPL 2023: అమ్ముడుపోకుండా ఉంటే బాగుండేది... భయపెట్టిన విరాట్ గురించి షాకింగ్ విషయం బయటకు!

RCB Virat Kohli : విరాట్ కోహ్లీ ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో ఒకరిగా పరిగణించబడ్డా  IPLలో అతని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోని సొంత ఆటగాడు ఒక షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు.  

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 25, 2023, 08:46 PM IST
IPL 2023: అమ్ముడుపోకుండా ఉంటే బాగుండేది... భయపెట్టిన విరాట్ గురించి షాకింగ్ విషయం బయటకు!

Shahbaz Ahmed on Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL-2023) 16వ సీజన్ మార్చి 31 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుందని కూడా అందరికీ తెలిసిందే. ఇక ఈ గేమ్ మొదలు కావడానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఆటగాడు షాబాజ్ అహ్మద్ తన ప్రకటనతో క్రీడా ప్రపంచంలో సంచలనం సృష్టించాడు.

ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభం కావడానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్న క్రమంలో ప్రతి సీజన్‌లాగే ఈసారి కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) టైటిల్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకుంది. నిజానికి ఐపీఎల్‌లో ఆర్‌సీబీ జట్టు ఒక్కసారి కూడా ఈ ట్రోఫీని అందుకోలేకపోయింది. గత సీజన్‌లో అయితే ఏకంగా విరాట్ కోహ్లీ కూడా కెప్టెన్సీని వదులుకున్నాడు. ఇప్పుడు ఫాఫ్ డుప్లెసీ మాత్రమే జట్టు కెప్టెన్ గా ఉన్నారు. ఇలాంటి క్రమంలో ఆ జట్టు ఆల్‌రౌండర్‌ షాబాజ్‌ అహ్మద్‌ ఓ సంచలన ప్రకటన చేశారు. 2020లో వేలం రోజున అమ్ముడు పోకూడదని తాను భావించినట్లు చెప్పుకొచ్చారు.

RCB కొత్త పోడ్‌కాస్ట్ ఎపిసోడ్‌లో, షాబాజ్ అహ్మద్ బెంగళూరు జట్టు వేలంలో తన కోసం వేలం వేస్తుందని తాను అస్సలు ఆలోచించడం లేదని అంగీకరించాడు. వేలం మొదటి రౌండ్‌లో అమ్ముడుపోకుండా మిగిలిపోయిన తర్వాత, టీవీ స్విచ్ ఆఫ్ చేశానని చెప్పుకొచ్చారు. అహ్మద్ మాట్లాడుతూ, 'ఆర్‌సీబీ నన్ను కొనుగోలు చేస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. నిజం చెప్పాలంటే ఆ సమయంలో నా భుజానికి గాయం అయిందన్నా ఆయన ప్రతి క్రికెటర్ ఐపీఎల్‌లో ఆడాలని కోరుకుంటాడని నా దేశవాళీ సీజన్ బాగానే ఉండడంతో నేను కూడా అలాగే ఆడాలని కోరుకున్నానని చెప్పుకొచ్చారు.

ఇక నిజానికి ఐపీఎల్‌కి మళ్లీ సమస్య రాకూడదని భావించి అమ్ముడుపోకుండా ఉంటేనే బాగుంటుందని అనుకున్నానని ఆయన అన్నారు. ఎందుకంటే నేను ఫిట్‌గా లేకుంటే ఆ సీజన్ వృథా అవుతుందని అన్నారు. తొలి ప్రయత్నంలోనే అమ్ముడుపోకుండా మిగిలిపోయాను, దీంతో నేను చాలా ఆనందంగా టీవీ స్విచ్ ఆఫ్ చేశా. కానీ వేలం ముగిసే సమయానికి నా స్నేహితులు నన్ను ఆర్సీబీ ఎంపిక చేసినట్లు చెప్పారని అన్నారు. నిజానికి షహబాజ్ అహ్మద్‌ను RCB జట్టు ఎంపిక చేసినప్పుడు కూడా, అతనికి అంత నమ్మకం లేదట.

ఫీల్డింగ్‌లో కోహ్లీ చాలా కఠినంగా ఉండటం కూడా అతనిని ఒకింత భయపెట్టిందట. నేను ఫీల్డింగ్ చేయడంలో ఇబ్బంది పడుతున్నాను, విరాట్ భాయ్ ఫీల్డింగ్ విషయంలో చాలా కఠినంగా ఉంటాడని భయపడ్డాను అని అన్నారు. అయితే కోవిడ్-19 నాకు గేమ్ ఛేంజర్ అని పేర్కొన్న ఆయన లాక్‌ డౌన్‌లో, భుజానికి శస్త్రచికిత్స చేయించుకోవడానికి నాకు సమయం దొరికిందని అన్నారు. అలా నేను మొదటి శిక్షణా శిబిరానికి జట్టులో చేరినప్పుటికి ఫిట్‌గా అయ్యానని అన్నారు. 

Also Read: RGV on Keeravani: కీరవాణి మాటలకు చచ్చిన ఫీలింగ్ వస్తుందన్న వర్మ.. నిజంగా చచ్చిపోవచ్చంటున్న ఫ్యాన్స్!

Also Read: Samantha Saree Photos: శారీలో సమంత క్లీవేజ్ షో.. అందాల విందు చూస్తే నిద్రపోలేరు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

 

Trending News