MAA President Manchu Vishnu: 'మా' అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు(Manchu Vishnu) తన మేనిఫెస్టోను అమలు చేసే దిశగా ముందడుగేశారు. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్​(MAA)లో మహిళల భద్రత(Women Safety) కోసం ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు విష్ణు వెల్లడించారు. ప్రముఖ సామాజిక కార్యకర్త, ప్రజ్వల ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సునీతా కృష్ణన్‌(Sunita Krishnan‌) ఈ కమిటీకి గౌరవ సలహాదారుగా ఉంటారని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'‘ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ అండ్‌ గ్రీవెన్స్‌ సెల్‌'’ పేరిట కమిటీని ఏర్పాటు చేశామని తెలియజేస్తున్నందుకు గర్వంగా ఉంది. మహిళా సాధికారత(Women Empowerment) కోసం ఈ కమిటీ పనిచేస్తుంది. పద్మశ్రీ సునీతా కృష్ణన్‌ సలహాదారుగా పనిచేయనున్నారు. ఈ కమిటీలో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. వారి వివరాలు త్వరలోనే తెలియజేస్తాం’’ అని విష్ణు తెలిపారు. ‘'మా'’లో మరింత మంది మహిళలను భాగస్వాములను చేయడానికి ఈ కమిటీ ద్వారా తొలి అడుగు వేస్తున్నట్లు విష్ణు(MAA President Vishnu) పేర్కొన్నారు.


Also Read: Prakash raj MAA Controversy: తెరపైకి మళ్లీ 'మా' రగడ.. ఆధారాలతో ప్రకాష్ రాజ్ ట్వీట్


Also Read: MAA Elections: 'ఇప్పుడు నా చేతుల్లో ఏమీ లేదు..అంతా అధ్యక్షుడిదే'..: కృష్ణమోహన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook